నా ప్రియతమ మితృడు భగవాన్ దాస్ తో 1970 లలో తీయించుకున్న ఫోటో
అవును స్నేహితుడే గురువు. వయస్సులో నా సాటివాడే కాని నాకు ఎంతో స్పూర్తి, ధైర్యం, ఆత్మ స్థైర్యాన్ని ఇస్తూ, ముఖ్యంగా, కార్టూన్లు వెయ్యటానికి ఎంతగానో ప్రోత్సహించినది నా ప్రియతమ స్నేహితుడు శ్రీ క్యానం భగవాన్ దాస్. విజయవాడ సత్యనారాయణపురం లో ఒక చక్కటి టైపు ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఎందరికో చక్కటి విద్యా దానం చేసాడు భగవాన్ దాస్. ఇప్పుడు మన మధ్య ఆయన లేకపోయినా, నాకెప్పుడూ గుర్తుండే గురువు లాంటి స్నేహితుడు భగవాన్ దాస్. అతను కూడ ఆపుడప్పుడూ కార్టూన్లు వేస్తో ఎంతో సరదాగా ఉండేవాడు.
1 comment:
బాబు గారు, శుభొదయం! మీ కార్టూన్ల బ్లాగు గురించి మితృలు శ్రీ శివరామప్రసాద్ గారు
తెలియజేశారు. ఇప్పూడే చూశాను. మాకు ఇలాటి మంచి అవకాశం ఇచ్చినందుకు
ధన్యవాదాలు. నేను సురేఖ పేరున అప్పుడప్పుడూ 1958 నుంచి కార్టూన్లు గీస్తున్న
ఓ చిన్న కార్టూనిస్టుని. మీకు సమయం దొరికినప్పుడు నా బ్లాగును ఒకసారి చూడండి.
surekhacartoons.blogspot.com (రేఖాచిత్రం)
Post a Comment