*********************************************************
"జో అత్యుతానంద జో జో ముకుందా..."జోలపాట అన్నమయ్య విరచితమని ఎంతమందికి తెలుసో అన్నది సందెహమే. అసలు జొలపాట గురించి పాత వాళ్ళకి, పల్లెల్లోవాళ్ళకి తప్ప, ఈ తరం వాళ్ళకి ఏమీ తెలియదనే అనుకొవాలి.జోల పాడకుండానే పిల్లన్లి నిద్రపుచ్చేస్తారు, లేదా ఆపని ఆయాలు చూసుకుంటారు. జోల పాడడం ఏవిటీ-లంగా వోణీ వేసుకున్నట్టు వింతగా వుండదూ-అనుకునే కాలం ఇది. ఇదంతా చూసి జాలిపాట పాడుకోవాలనిపిస్తుంది.
పారుపల్లి శ్రీరంగనాథ్ అన్నమయ్య ప్రాజెక్ట్ లో చేరేదాకా నాకు అన్నమయ్య కీర్తనల గురించి వినటమేగాని ఆసక్తిగా ఎప్పుడూ చదవలేదు.ఈ ప్రాజెక్ట్ వల్ల అన్నమాచార్యుల కీర్తనలు ప్రచారంలోకొచ్చాయి.
రంగనాథ్ వాళ్ళ అన్నయ్య శ్రీరామ చంద్రమూర్తి మా భగవాన్ శిష్యుడు. భగవాన్ ఆయన చేత విజయవాడ గాంధీనగరంలో ఒక టైపు ఇనిస్టిట్యూట్ పెట్టించాడు. బాగా పాటలుపాడే రంగనాథ్ కూడా అన్నయ్యకు సాయంగా అక్కడే ఉండేవాడు.
అన్నమాచార్య ప్రాజెక్ట్ లో చేరాలని రంగనాథ్ -వద్దు, వాళ్ళిచ్చే భత్యం నీ సంసారానికి సరిపోదు, ఇక్కడయితే సమస్య వుండదు -అని వాళ్ళ అన్నయ్య, చిన్న గొడవ పడుతూవుండేవారు. ఆసమయంలో, "తనకి పాడడం అంతే చాలా ఇష్టం, అందులోనే రాణించాలని అనుకుంటున్నాడు, సినిమల్లొ అవకాశాలు కూడ పెద్దగా కనిపింటం లేదు, ఆ ప్రాజెక్ట్ లో చేరి తన తిప్పలేవో తను పడతానంటున్నడుకదా, పోనివ్వరాదా" అన్నాను.
చివరకు, అన్నయ్య ఒప్పుకొవడం, తమ్ముడు అన్నమయ్య ప్రాజెక్ట్ లో చేరడం జరిగింది. రంగనాథ్ అక్కడ కీర్తనలు పాడడం నేర్చుకున్నాడు. ప్రాజెక్ట్ లో భాగంగా వేల కచేరీలు చేశాడు. సినిమా గాయకుడ్ని కాలేదన్న బెంగను మర్చి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. తిరుపతి తిరుమల దేవస్థానం ఉద్యోగిగా విశ్రాంతి తీసుకున్నా, ఇంకా పాడుతునే ఉన్నాడు.
రంగనాథ్ అన్నమాచార్య ప్రాజెక్ట్ లో చేరిన కొత్తలో, శ్రీరామచంద్ర మూర్తి, నేనూ మిత్రులం కలిసి తిరుపతి వెళ్ళాం. వాళ్ళు నేర్చుకుంటున్న కార్యాలయానికి వెళ్ళాం. అన్నమయ్య కీర్తనల భాండాగారాన్ని చూసి అశ్చర్యపోయాం. ఒక్కో కీర్తన అరిటాకు అంత రాగిరేకులమీద చెక్కివున్నాయి.వాటిని చక్కగా వరుసగా వ్రేలాడదీసారు. ఒక్కొ రాగిరేకు బరువు తక్కువేమీవుండదు. తాళపత్రాలుకూడా కాలానికి నిలవవని కాబోలు, ఈ పద్ధతి ఎంచుకున్నారు.
తర్వాత అక్కడ కూర్చుని వాళ్ళు కీర్తనలు సాధన చేస్తొంటే చూశాము. అప్పట్నించి అన్నమయ్య కీర్తనలపట్ల ఆసక్తి పెరిగి ఆ పుస్తకాలు కొనడం ప్రారంభించాను.ఓసారి హైదరాబాదు తిరుపతి తిరుమల దేవస్థానం కార్యాలయంలో, అన్నమయ్య కీర్తనల సంపుటాలు చూశాను. మరుసటిరోజువెళ్ళి 20 సంపుటాలు పైగా కొనేశాను, మధ్యలో నాలుగైదు సంపుటాలు దొరకలెదు).
అప్పుడప్పుడూ, ఆ పుస్తకాలు తిరగేస్తూవుంటే ఈ జోల పాటలు కనిపించాయి.అవి వ్రాసినది ఈ మహానుభావుడా అనుకున్నాను. మహానుభావుడు కాబట్టే, ఆయన కీర్తనల కీర్తి ప్రపంచమంతటికి తెలిసింది. గతంలో సినిమా కవులు ఈ కీర్తనల్లోని కొన్ని వరుసలు వాడుకున్నట్టు తెలుస్తుంది. అన్నమయ్య, త్యాగయ్య, వేమన, సుమతి ఇచ్చిన పద సంపద వేనవేలు - ఇవి చాలు తెలుగువాడిగా పుట్టినందుకు గర్వపడడానికి.
వైశాఖ శుద్ధ పూర్ణిమ అన్నమయ్య జన్మదినం.దినపత్రికలో చూసాను. వెంటనే నేను వేసిన కార్టూన్ గుర్తుకు వచ్చింది. అదే ఇది.

సరే నా అన్నమయ్య జ్ఞాపకాలు చదివారు. ఆ చక్కటి లాలి పాట, అన్నమయ్య విరచిత జోల పాట వినాలనుకున్నా, చూడాలనుకున్న హాయిగా వినండి, చూడండి, చూస్తూ వినండి.
వీడియో పాట పాడినది "ప్రియా సిస్టర్స్", ఆడియో పాట పాడినది ప్రముఖ గాయని ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారు. ఈ రెండూ కర్టెసీ ఒక వెబ్ సైట్ (క్లిక్)
1 comment:
అలాగే స్వాతి ముత్యం సినిమా లో "లాలీ లాలీ" అనే లాలిపాట కూడా వినడానికి తీయగా ఉంటుంది. అందులో పదాల అమరిక, ఆ రాగం నిజంగా అద్భుతం. ఇప్పటికీ నిద్ర రాకపోతే ఆ పాట వింటూ నిద్రలోకి జారుకుంటాను నేను. ఇప్పటి జనాలకి మున్నీ బద్నాం అయితేనే గాని నిద్ర రాదు మరి ఏం చేస్తాం చెప్పండి.
Post a Comment