కళాత్మక చిత్రాలు తీస్తే కళ్ళవెంబడి నీళ్ళు తప్ప, కాసులురావు. లక్షలు పెట్టి తీసిన చిత్రానికి ఓ అవార్దు కాగితమ్ముక్కో, ఓ సన్నటి జ్ఞాపికో వస్తే సరిపోతుందా? మరి ఆ సినిమాకి వచ్చిన నష్టం ఎవరు పూడుస్తారు? అంచేత, కళాత్మక చిత్రాలు లాభదాయకం కాదు, కాదు, కాదు....అనిపిస్తుంది ఎవరికైనా.
మన తెలుగు సినిమాకి అవార్ద్ లు రాలేదని దిగులుపడనక్కరలేదు. వ్యాపారాత్మక చిత్రాలు భారీగా తీస్తున్నారు. దానివల్ల వేలమంది బతుకుతున్నారు. పరిశ్రమ జోరుగా నడుస్తోంది. అదే అందరికి కావల్సింది, అవార్ద్ లు కాదు!
తెలుగు సినిమా వారూ! మీదారిన మీరు తీస్తూపోండి, అవార్ద్ లు వాటికంతటకవే ఎప్పుడో ఒకప్పడు వస్తాయి! అంచేత మంచి సినిమాలు పనికట్టుకుని తీయొద్దు - అది మద్యపాన నిషేధంతో సమానం. ఆదాయం ఠపీమని పడిపోతుంది సుమా!

3 comments:
హహహహ ఆదాయం కూడా రావట్లేదని కదా మొత్తుకుంటున్నారు ఈ మధ్య...మనకి అదీ లేదు ఇదీ లేదులెండి....ఏడవడం కంటే విరక్తితో నవ్వడం మేలని అందరూ నాలా గట్టిగా నవ్వేస్తున్నారు :D
నాకు ఈ కార్టూన్ క్రింద రాసిన కామెంట్ అర్ధం కాలేదు . ఎవార్డ్ సినిమాల వల్ల కార్మికులకి ఏం నష్టం ? కమ్మర్షియల్ సినిమాలన్నీ సక్సస్ అవుతున్నాయా ? ఐనా .. ఎవార్డ్ రాలేదని మన తెలుగు సినిమా వాళ్ళెవరూ బాధ పడట్లేదు . హాయిగా వాళ్ళ చెత్త సినిమాలు వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారుగా ! కార్టూన్ మాత్రం బాగుంది .. బాబు స్టాండర్డ్ లోనే . అభినందనలు .
రమణగారు,
మీ ప్రశ్నకు, నా జవాబు మొన్న రాసాను.అప్పుడె నెట్ ఇబ్బంది పెట్టింది.వెంటనె కరెంటు పోయింది. ఇవ్వాళ చూస్తే రెండూ లేవు.
మళ్ళీ అప్ లోడ్ చేస్తె రాలేదు. సరే, సాధారణంగ కళాత్మక చిత్రాలు తక్కువ పెట్టుబడివి కాబట్టి, తక్కువమంది కార్మికులకు పనివుంటుంది. ఆదే పెద్ద చిత్రాలు అయితే ఎక్కువమందికి ఉపాధి దొరుకుతుంది -అని నాభావం.
Post a Comment