Thursday, June 23, 2011

"..."పన్ను" నొప్పి.....అంతింత కాదయా...."

DON'T DISTURB DADDY! HE IS WORKING ON HIS TAX ASSESSMENT

ఈ కార్టూన్ చూసి, శ్రీ శివరామప్రసాద్ చేసిన వ్యాఖ్య బాగుండి , ఇక్కడకు కార్టూన్ తో  బాటుగా చేర్చాను 
ప్రస్తుత ఆదాయపు పన్ను వ్యవస్థ మధ్యతరగతిని మాత్రమే ధ్యేయంగా పెట్టుకున్నది. ఈ బడుగు జీవుల దగ్గరనుంచి టి డి ఎస్ పేరిట జీతం ఇచ్చినట్టే ఇచ్చి "పంటి పోటు" పెడుతున్నారు. డిపాజిట్ కు వడ్డీ ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుంటున్నారు. ఇక లాభం లేదు, అని మా యూనియన్ వాళ్ళతో చెప్పాను నాలుగేళ్ళకి ఒకసారి జరిగే వేతన ఒప్పందంలో జీతం పెంచమని అడిగే బదులు, ప్రతి సంవత్సరం మా దగ్గర నుంచి "లాక్కున్న" టి డి ఎస్ టాక్స్ మరుసటి సంవత్సరం మా ఎంప్లాయర్ వాపసు ఇవ్వాలి అని అడగండి అని. సరే అది ఈ సంవత్సరం ఆదాయంలో కలుస్తుంది, పెట్టండి "పంటి పోటు" మళ్ళీ, కాని, మరుసటి సంవత్సరం అదంతా వాపసు. కానీ మా వాళ్ళకి అర్ధ కాలా, లేదా అర్ధం కానట్టు నటించారో. లేకపోతే వాళ్ళ నిరక్షరాశ్య బామ్మరిదికి పదోన్నతి ఎలా, పెంపుడు కొడుకు పెళ్ళానికి ఉద్యోగం వేయించుకోవటం ఎలా. , అడగలేదు. ఇవ్వాళ యూనియన్లు యజమానుల కన్నా ఎక్కువ బాసిజం చూపిస్తున్నాయి. నెలనెలా వాళ్ళకి కప్పం కట్టడమే కాని వాళ్ళు చేసేది అతి తక్కువ, ఈ రోజున వాళ్ళు లేకపోయినా వాళ్ళు చేస్తున్నామనేవి రొటీన్ గా జరగనే జరుగుతాయి.

అసలు జీతం పెంచనేల , టాక్స్ పేరిట తీసుకోనేల, పోనీ మూణ్ణెల్లకు ఒకసారి పెరిగే డి ఎ లో ఏదో టోకు ధరల సూచి (రిటైల్ ధరల ప్రకారం ఐతే దొరవారికి గిట్టుబాటు కాదట) ప్రకారం పెంచుతారుట, ఆ సూచీలో ఈ టాక్సును కూడ కలిపి లెక్కకట్టరాదూ! పాతికేళ్ళ క్రితం ఉద్యోగం లో చేరి ఒకటి రెండు పదోన్నతులు పొందినా, ఉన్నంతలో సద్దుకుపోవటమే అలవాటు పడ్డాం కాని, మధ్యతరగతి ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెరిగాయా??! దీనికి కారణం పన్నుపోటే కదా. పోనీ మనకి పోటెక్కించి పన్ను లాగారు, ఆ డబ్బు సద్వినియోగం అవుతోందా.......ఓట్ల కోసం తల తిక్క పథకాలు, వాళ్ళకు ఓటేస్తారు అనుకున్న వాళ్ళకి ప్రతిదీ ఉచితం. టాక్స్ కట్టేది ఒకడు అనుభవించేది మరొకడు. ఆపైన స్కాములు, వాటి గురించి చెప్పేది ఏమున్నది. .పంటిపోటే మిగులుతున్నది మనకు.

మన పన్నులలో ఎక్కువ భాగం రక్షణ శాఖకే. కాని, ఉట్టి తుక్కు గాళ్ళైన శత్రువులకు మళ్ళి మర్చిపోని పాఠం చెప్పలేకున్నాం. వాళ్ళతో లేనిపోని ఇచ్చకపు సంభాషణలు, అనవసర చర్చలు. ఎన్ని చెప్పుకున్నా ఏమి లాభం, కడుపు చించుకుంటే........ 


-శివరామప్రసాద్ కప్పగంతు





1 comment:

బాబు said...

చిన్నప్పటి జోక్ చెప్తాను: ట్రేడ్ యూనియన్ అంటే, ట్రేడ్ ఇన్ ది నేం ఆఫ్ యూనియన్.