Err...Hmm...Doctor! he is pestering to save Gas and So I have been cooking one week's food at a time for him. But, I am cooking my food daily....
చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం రవాణా సౌకర్యాల మీద పడుతుంది. అలా ప్రయాణం చేసి మన దగ్గరకు రావల్సిన ప్రతి వస్తువు ధర బాగ పెరుగుతుంది (అలా కాని వస్తువు ఒక్కటైనా ఉన్నదా ఈ రోజున). తోట కూర ఊళ్ళో తొటలో ఉచితంగా దొరకవచ్చు, కాని అది రైతు బజారుకు ప్రయణం చేసి వచ్చేసరికి ధర పలుకుతుంది. మధ్య దళారీ రైతుకంటే ఎక్కువ లాభం పొందుతాడు ఇలాగే అన్నీనూ. ధరల పెరుగుదలకు చమురు ధరలు ఒక్కటే కారణం కాదు. అవినీతి పెరిగితే అన్ని ధరలూ పెరుగుతయ్. ప్రజలు ఈ రెండు విషయాల్లో నిస్సహాయులు, సరిగా చెప్పాలంటే బానిసలు. గాలి వాటానికి ఎగిరిపోతున్న అల్ప ప్రాణులు.
మనం కొనే పెట్రోల్ పెరిగితే నడిచి వెళ్ళటమో, లేక బస్సులో వెళ్ళొ కొంత పొదుపు చేసి, పెరిగిన ధర నుండి కొంత ఉపశమనం, స్వంత కష్టంతో పొందవచ్చు. కాని. ఇప్పుడు వంట గ్యాస్, కిరొసిన్ ధరలు కూడా పెరిగాయి.ఇందులో పొదుపు పాటించాలా? అలా చేస్తే ఆరోగ్యాన్నికూడా పొదుపు చేసినట్టు అవుతుంది. ఆస్పత్రుల చుట్టూ చక్కర్లు కొట్టాలి.
కొంతమంది రెండు పూటలకు సరిపడా వండేసి తర్వత కాస్త వెచ్చ పెట్టుకుని తింటారు.నా ఉద్దేశ్యంలో ఇది అనారోగ్యానికి హేతువు. పొదుపు పేరిట బద్ధకించకుండా తమ వంటికి సరిపడే ఆహారం ఏపూటకాపూట వండుకుని వేడివేడిగా తింటే ఎంతో ఆరోగ్యం. ఎన్నో రోగాలకు ఆసుపత్రులకు దూరంగావుండొచ్చు. వైద్య ఖర్చులు రవాణా ఖర్చులూ బాగ తగ్గుతాయి. రేపు అవినీతిపరులకు వ్యతిరేకంగా ఓటు వెయ్యాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలికదా!
సామాన్యంగా చాలా మందికి (ఇక్కడ వ్యక్తులే కాదు అనేకానాక సంస్థలు కూడ) పొదుపు అంటె ఖర్చు తగ్గించటం అనుకుంటారు. కాని పొదుపు అంటే సరైన సమయంలో అవసరమైన వస్తువుకోసం, తగినంత ఖర్చు చెయ్యటం. పొదుపు పేరిట చెత్త తిండి తినటం, ఒకేసారి వంట చేయటం వల్ల ఆరోగ్యం చెడి, మందులు, డాక్టర్ ఫీజులు కలిపి, ఖర్చు పోదుపుకన్నా ఎక్కువ అయ్యి లాభం గూబల్లోకి వస్తుంది.
బతకడాని తినాలి. తినడానికి న్యాయంగా సంపాదించినదానితో సరిపుచ్చుకోవాలి. ఎక్కువ సంపాయించాలన్న తపనలో పక్కదార్లు పట్టి సంపాయిస్తే ఎటూ ఆ సొమ్ము తినలేడు తిండీ తినలేడు. ఆ సంపదను బహిరంగంగా అనుభవించనూలేడు. అందుకు అందరికి తెలిసిన ఎన్నొ ఉదాహరణలున్నాయి. అయినా, డబ్బు తినడానికి ఎక్కువమంది ఇంత ఆరాటపడుతుంటారో చూస్తోంటే......ఏమనుకోవాలి. ఇదొక ఆధునిక వెర్రి అనుకోవాలి. అంతే మరి!
బతకడాని తినాలి. తినడానికి న్యాయంగా సంపాదించినదానితో సరిపుచ్చుకోవాలి. ఎక్కువ సంపాయించాలన్న తపనలో పక్కదార్లు పట్టి సంపాయిస్తే ఎటూ ఆ సొమ్ము తినలేడు తిండీ తినలేడు. ఆ సంపదను బహిరంగంగా అనుభవించనూలేడు. అందుకు అందరికి తెలిసిన ఎన్నొ ఉదాహరణలున్నాయి. అయినా, డబ్బు తినడానికి ఎక్కువమంది ఇంత ఆరాటపడుతుంటారో చూస్తోంటే......ఏమనుకోవాలి. ఇదొక ఆధునిక వెర్రి అనుకోవాలి. అంతే మరి!
No comments:
Post a Comment