Wednesday, August 3, 2011

త్వరలో వెంకన్నా'స్ కోల్డ్ చూస్తూనే ఉండండి ఈ బ్లాగ్

  • తుమ్ము మహాత్మ్యం  - వెంకటరమణ తుమ్మితే పనులన్నీ అవ్వటం తథ్యం 
  • అందుకే వెంకన్నా'స్ కోల్డ్ ,  మెకన్నా'స్ గోల్డ్ లాగా. పోలిక పేరులో ఉన్న పారడీ వరకే మరెక్కడా లేదు.
  • ఎప్పుడూ చిర చిరలాడుతూ హీరోకు చెంప దేబ్బలిచ్చే హీరోయిన్, ఉత్సాహంతో ఉండే ఒక డిఫేక్టివ్ అదే  అదే  డిటెక్టివ్, పెద్ద పెద్ద మీసాలు, అవి ఉన్న  పెద్ద బుర్రలున్నా అందులో గుజ్జులేని  విలన్లు అందరూ ఉన్నారు.
  • వీళ్ళందరి మధ్యా పాపం మన హీరో వెంకట రమణ!
  •  ఎప్పుడో 1972 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ధారావాహికగా వచ్చింది, అందరి ఆదరణా పొందింది. 
  • ధారావాహిక  అంటే మొత్తం మొత్తం ఒకేసారి ప్రచురిస్తాను అనేసుకునేరు. అలా వెయ్యటం కష్టం కదా. అప్పుడప్పుడూ కొన్ని బొమ్మలు "ధారావాహిక" లేబుల్ కింద వేస్తూ ఉంటాను. అవన్నీ కలిపి చూసుకుంటే, పూర్తి కథాకమామిషు తెలుస్తాయి!     
  • చూస్తూ ఉండండి, 
  •  త్వరలో అతి త్వరలో 
  • ఇదే బ్లాగులో మీ అందరి కోసం  

1 comment:

BP said...

వెంకన్నాస్ కోల్డు - మెకన్నాస్ గోల్డు, అద్భుతం! ప్రచురణలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.