Monday, December 5, 2011

బొంబాయి కా బాబు (అతడు)దేవానంద్

.

  దేవానంద్ నా అభిమాన నటుల్లో ఒకరు. చిన్నప్పుడు ఆయనలా తల దువ్వుకోడానికి ప్రయత్నించే వాడిని. జుట్టు వంగటానికి కాస్త తల తడిపే వాడిని.నా మిత్రుడు సత్యం  అచ్చు అట్లాగే దువ్వేవాడు.   అలాగ ఎందఱో ! 50 ఏళ్ళ క్రితం   విజయవాడ లీలామహల్ లో  "బొంబాయి కా  బాబు" సినిమా చూసాను. ఇటీవల వచ్చిన "అతడు" సినిమా లా వుంటుంది కథ. అందులో దేవానంద్ హీరో.  " ఏరువాక సాగాలో రన్నో చిన్నన్న..."(రోజులుమరాయి) బాణితో కథానాయిక పాడే పాట వుంది.   హాలీవుడ్  నటుడు గ్రేగరిపెక్ సినిమాలు చూసేక అనిపించింది దేవానంద్ అలా ఉంటాడని. ఎస్. డి. బర్మన్ , కిశోర్ కుమార్ దేవానంద్ కలయికతో వచ్చిన  సినిమాలు అత్భుతమయినవి. నూతన్ తో  అతని  జోడి  బావుండేది. దేవానంద్ నటించిన  "జబ్ ప్యార్ కిసిసే హోతా హై"  నాకు బాగా నచ్చిన సినిమా. తేరే మేరె సప్నేలో ముంతాజ్ ని  ముందు కూర్చోపెట్టుకుని  దేవానంద్ సైకిల్ తొక్కే పాట  సన్నివేశం ఆ రోజుల్లో  యువతని ఎంతో ఆకట్టుకుంది.   తేరే ఘర్కే సామ్నే, గైడ్ , సి.ఐ.. డి. , హరే రామ  హరే  కృష్ణ , ....ఇలా  ఎన్నో సినిమాలు  ఆయన  నటించినవి చూసేను.  ప్రేమ హావభావాలను అందంగా చూపించే అందమయిన నటుడు  దేవానంద్. నటనలో  దేవానంద్ , షమ్మికపూర్ లను కలిపి అనుకరించి గొప్ప పేరు తెచ్చుకున్నాడు  రాజేష్ ఖన్నా అనిపిస్తుంది. ఇప్పటి  తెలుగు నటుల్లో కూడా  దేవానంద్ అప్పటి నటనను అనుకరిస్తున్న వాళ్ళు  వున్నారు. 

     నాలుగేళ్ళ క్రితం కాబోలు, దేవానంద్ తిరుమల దేవుడిని మొదటి సారిగా దర్శించు కున్నప్పుడు . "ఇంతటి దివ్యమయిన సుందర మూర్తిని ఇంతకాలం చూడకుండా ఎలా వుండగాలిగాను ? ఇప్పటికైనా ఆ భాగ్యం దక్కినది .
లేకపోతె, జీవితంలో  ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కోల్పోయి ఉండేవాడిని" అన్నారు. 

      తన అందమయిన  నటనతో కోట్లాది   ప్రేక్షకుల హృదయాలను అలరించిన దివ్య నటుడు (ధరందేవ్ కిశోరిమల్ ఆనంద్) దేవానంద్ కిదే  నివాళి!

దివినుండి  భువి కేగిన  ఈ హిందీ నటుడికి అనేక మంది అభిమానులు, ఎవరి పద్ధతిలో వారు నివాళులు అర్పించారు. యు ట్యూబ్ లో, ఒక పాట కనపడుతున్నది. అందులో దేవానంద్ నటించిన, (ప్రముఖ ఆర్ కే నారయాణ్ రచించిన) గైడ్ సినిమాలో దేశవ్యాప్తంగా   హిట్ పాటగా పేరొందిన, గాతే రహే మేరా దిల్ పాట ఇది. ఈ పాటకు దేవానంద్ కు ఒక వీరాభిమాని పాడిన పాటను డబ్ చేసారు. చూసి, విని ఆనందించండి. 

No comments: