Sunday, December 18, 2011

మందుకు పోదాం!!

      "Seems, it's a medicine that keeps him warm.  He's arranged it for himself !"

 శ్రీ శ్రీ మహానుభావుడు 'పదండి ముందుకు....' అంటూ ఒక ఉద్యమకారుడిగా జనాన్ని చైతన్యపరచటానికి వ్రాశారు.  మరిప్పుడు!  కొందరు  మద్యమకారులు  'పదండిమందుకు..పదండి తోసుకు..పదండి పోదాం  (కల్తీమందు తాగి) పైపైకి .." అంటున్నారు. మద్యం ఒక ఉద్యమంలా సాగుతోంది అన్నిచోట్లా. నేటి వార్తలు చెబుతున్నాయి--కొందరు నేతలకు ఇదే మేతట. రేపు 'లోకపాల్' వస్తే వీళ్ళంతా మంచివాళ్ళు  అయిపోయి  మంచినీళ్ళు తాగుతారేమో  వేచి చూడాలి. అదే జరిగితే మంచినీళ్ళకు  మరింత కటకట, అకటా!

నా చిన్నతనంలో మా వూళ్ళో ప్రతి ఫర్లాంగ్ కు ఒక గ్రంధాలయం వుండేది. ప్రతి రాజకీయ పార్టీ గ్రంధాలయాలను  నడిపేవి. ఇప్పుడు ఎవూరైనా ప్రతి ఫర్లాంగ్ కి  'బ్రాందీలయాలు' ఉంటున్నాయి. అహూ ...ఎంత ప్ర--గతి!!  
     

2 comments:

Saahitya Abhimaani said...

అద్భుతమైన కాప్షన్, "మందుకు పోదాం". చాలా మంచి వ్యాఖ్య వ్రాసారు. మన సమాజం ఏ విధంగా దిగజారిపోయిందో, అడుగడుక్కీ ఉన్న ఈ "మందు" షాపులే తెలుపుతున్నాయి.

వీటన్నిటినీ పారద్రోలటానికి లోక్పాల్ కాదు కదా ఆ పై దేముడే వచ్చినా ఏమీ కాదు. ప్రజల్లో "బుద్ది" అనేది పెంపొందాలి. ఇది తప్పు ఇది ఒప్పు అనే ఇంగిత జ్ఞానం రావాలి. అప్పుడే ఈ అవినీతి, ఆపైన తాగుడు వంటి రుగ్మతలకు తగ్గేది.

Padmarpita said...

:-)