"With that over-coating of cream, your face is looking like a cake and very alluring !!"
===============================================
పోయిన వారం ' ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఎక్కువవడానికి వారి వస్త్రధారణ ఒక కారణం' అని ఓ పోలీసు ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్య కొంత విమర్శలకు దారి తీసింది. ఆడవాళ్ళ వస్త్రధారణ రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయా ? అంటూ టీవీ చానెళ్ళ లో వాదనలు, చర్చలు, ఒటింగులు, బయట ర్యాలీలు జరిగాయి.
ఎక్కడో ఒకచోట అరుదుగా తప్ప, ఆడపిల్లల వస్త్రధారణ అంత అక్షేప ణీయం గా ఏమీ లేదనిపిస్తుంది. అత్యాచారాలు ఎక్కువగా మగవాళ్ళ ఉన్మాద ప్రవర్తన వాళ్ళ జరుగుతోందని చాలామంది అభిప్రాయం.
.
ఎక్కడో ఒకచోట అరుదుగా తప్ప, ఆడపిల్లల వస్త్రధారణ అంత అక్షేప ణీయం గా ఏమీ లేదనిపిస్తుంది. అత్యాచారాలు ఎక్కువగా మగవాళ్ళ ఉన్మాద ప్రవర్తన వాళ్ళ జరుగుతోందని చాలామంది అభిప్రాయం.
.
కొడవటిగంటి కుటుంబరావు గారి 'కురూపి' కథ లో ఒక వాక్యం - ఈ సందర్భంగా గుర్తుకు వస్తోంది. 'స్త్రీ కురూపి అయినా ఎప్పుడో ఒకసారి, ఏదో ఒక క్షణం లో అందంగా కనిపిస్తుంది'.
ఆడవాళ్ళు అందంగా కనిపించడం వారి సహజ గుణం. కొందరు ' అందం అమెదికాదు , ఆమె వయసుది, అన్నట్టుగా వుంటారు . కొందరు హుందాగా వుండి అందంగా కనిపిస్తారు. కొందరు మాట తీరువల్ల , కొందరు హావ భావాల వల్ల , కొందరు వారి మంచి నడత వల్ల అందంగా కనిపిస్తారు. కేవలం వస్త్ర ధారణ వల్ల అందంగా కనిపించడం అంటే, అది కొంత మేరకే అనుకోవాలి. ఎక్కువమంది వస్త్ర ధారణ వారి అంతస్తును తెలియ చేస్తుంది.
అసభ్య వస్త్రధారణ ఎక్కువగా సినిమాల్లో చూస్తాం. అన్ని సినిమాలు దాదాపు ఒకేరకంగా ఉంటున్నాయి కాబట్టి, తారల వస్త్రధారణ ఆసభ్యంగా వున్నా పెద్దగా ప్రేక్షకులు పట్టించుకోవటం లేదు . బయట అలా వస్త్రధారణ చేసేవాళ్ళు మనకు చాల తక్కువ శాతం కనిపిస్తారు. వారికి వేరే దృష్టి ఉండొచ్చు.
30 -40 సం. క్రితమైతే దక్షినాది రాష్ట్రాల్లో ( పంజాబీ)డ్రెస్ వేసుకునే ఆడవాళ్లు చాల తక్కువ. దాదాపు అందరూ లంగా, జాకెట్ , వోణి, పెళ్లి అయ్యాక చీర, ధరించటం ఆచారం అయింది. 'డ్రెస్' వేసుకుంటే వింతగాను,
బరితెగించినట్టు గాను భావించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. లంగా,వోణి
వింతగా, ఎబ్బెటుగా అనిపిస్తోంది ఈతరం వారికి. 'డ్రెస్' ఈనాటి ఆడవాళ్లందరికి సామాన్యమయిన, చాలా అనుకూలమయిన వస్త్రధారణ అయింది. ఆక్షేపణ ఎక్కడా లేదు. బస్సులకోసం పరుగులెట్టటం, సైకిళ్ళు తొక్కడం, బైకులు నడపటం, చేసే ఈనాటితరం ఆడపిల్లకు 'డ్రెస్' చాల అనువుగావుంది. ఇక ఆక్షేపణ చేయడానికి ఏముంది ?
ఆడవాళ్ళ వస్త్రదారణకి కారణాలు చెప్పుకున్నాం. బాగానేవుంది. మగవాళ్ళ వస్త్రధారణ కొంచెం గమ్మత్తుగానే అనిపిస్తోంది. చాలామంది కుర్రకారు చొక్కాలు చాల పొట్టిగా ఉంటున్నాయి. వాళ్ళు చెయ్యి పైకెత్తితే బొడ్డు కనిపిస్తుంది. దాని బుష్-షర్టు అనాలో బుష్ జాకెట్ అనాలో తెలియటంలేదు.బెల్ట్ కూడా చాలా కిందికే వుంటుంది.ఈ పొట్టి చొక్కాల రాకకు కారణం బైక్ ల మీద కూర్చోడాని కి వీలుగా వుండడం కావచ్చు. .
ఈరకం వస్త్రధారణ కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడడంలేదు. కొన్ని జీన్స్ ప్యాంట్లు తాపీ పనికి వెళ్లి వచ్చినట్టుగా వుంటాయి. పైగా తొడల దగ్గర మోకాళ్ళ కింద చిరుగులు కూడాను. చిరుగు
వస్త్రాలు దరిద్రానికి గుర్తు అనేవారు గతంలో.
******
ఇక్కడ చాలా పాత సినిమా సన్నివేశం గుర్తుకు వస్తోంది.
గుమ్మడి ఇంటినుంచి బయటకు వెళుతూ ఉంటాడు. వెనకనుంచి కూతురు శారద 'నాన్నా! నీ చొక్కా చిరిగిపోయి బాగా కనపడుతోంది. పైన కోటు వేసుకో. కనపడదు. ' అంటుంది. కోటు అందిస్తుంది. గుమ్మడి కోటు వేసుకుంటాడు. అది భుజం దగ్గర బాగా చిరిగి వుంటుంది. శారద అది చూసి నొచ్చుకుంటుంది. అప్పుడు గుమ్మడి 'హూ! దరిద్రాన్ని దాచాలేమమ్మా !' అంటాడు.
***********
ఆడవాళ్లు అయిన, మగాళ్ళు అయిన వస్త్ర ధారణ వారి స్వవిషయం అయినప్పటికీ, వారి పనులకు, నడతకు అనుకూలమయినవయితే ఆక్షేపణ ఏముంది?
వస్త్రాలు దరిద్రానికి గుర్తు అనేవారు గతంలో.
******
ఇక్కడ చాలా పాత సినిమా సన్నివేశం గుర్తుకు వస్తోంది.
గుమ్మడి ఇంటినుంచి బయటకు వెళుతూ ఉంటాడు. వెనకనుంచి కూతురు శారద 'నాన్నా! నీ చొక్కా చిరిగిపోయి బాగా కనపడుతోంది. పైన కోటు వేసుకో. కనపడదు. ' అంటుంది. కోటు అందిస్తుంది. గుమ్మడి కోటు వేసుకుంటాడు. అది భుజం దగ్గర బాగా చిరిగి వుంటుంది. శారద అది చూసి నొచ్చుకుంటుంది. అప్పుడు గుమ్మడి 'హూ! దరిద్రాన్ని దాచాలేమమ్మా !' అంటాడు.
***********
ఆడవాళ్లు అయిన, మగాళ్ళు అయిన వస్త్ర ధారణ వారి స్వవిషయం అయినప్పటికీ, వారి పనులకు, నడతకు అనుకూలమయినవయితే ఆక్షేపణ ఏముంది?
******
ఈసందర్భంగా బాపుగారి కార్టూన్ ఒకటి చెప్పుకోవాలి;
కొత్త చీర కట్టుకున్న భార్య భర్తతో: 'ఏవండీ, ఈనైలాన్ చీర ఎలావుంది?'
అడుగుతుంది. 'కట్టుకురా చూస్తాను!' అంటాడు.
నేనూ ఒక కార్టూన్ వేసాను ఎప్పుడో.
ఓ విద్యార్ధిని ప్రిన్సిపాల్ తో: "సర్, క్లాసులో కొంతమంది నన్ను చూసి ఈల
వేస్తున్నారు..'
'నిన్ను చూస్తోంటే నాకే ఈల వేయలనిపిస్తోంది ' అంటాడు ప్రిన్సిపాల్.
******
ఈ ఉరుకు -పరుగు జీవితాలతో ఆడపిల్లకి జడ వేసుకునే సమయం కూడా వుండటం లేదు. 'ఎంత పోడుగో' అని జుట్టు పెంచినా జడకు సమయంలేక విరబోసుకుని వెళుతున్నారు. ఎక్కువమంది పొట్టి-జుట్టు చేసుకుని, క్లిప్ తో కట్టేస్తున్నారు. కొంతమంది మగవాళ్ళు మాత్రం జుట్టు పెంచుకుని ముడి వేసుకుంటున్నారు . వారికి సమయం బాగానే వుందనుకోవాలి.
ఈతరం ఆడపిల్లలు బ్యూటి పార్లర్ సాయంతో అందంగా కనపడటానికి
తాపత్రయ పడుతున్నారు. డబ్బు కు వెనుకాడడం లేదు. మధ్య వయస్కులు, మధ్య, దిగువ తరగతుల వారికి కూడా అదే తాపత్రయం, అదే ఖర్చు. దీనికి బదులు, ఆ డబ్బు మంచి ఆహారానికి, ఆరోగ్యానికి ఖర్చుపెడితే మరింత అందంగా కనపడతారు - అని నేనననుగాక అనను. ఎంచేతంటే ఇది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం.
ఏమయినా నేటి యువతకు అన్నీ తెలుసు, ఒకరిచేత చెప్పించుకునే అవసరం లేదు.
శుభాకాంక్షలు !
2 comments:
నమస్కారం బాబు గారూ..!
కార్టూన్ తో పాతు చక్కటి వ్యాఖ్యలు కూడా రాసారు..
కళాసాగర్
సంతోషం.
Post a Comment