ఇదేమిటో తెలుసా? ఒక ముఖ చిత్రం. అయితే, ఇదేదో పత్రిక ముఖచిత్రం అనుకుంటే పొరపాటు పడ్డారన్నమాటే. లోపలి పేజి లో వున్న మరొక బొమ్మ ఈ క్రింద వుంది. అది చూసి చెప్పవచ్చునేమో ప్రయత్నించండి. .
. చెప్పలేక పోతున్నారా? ముచ్చటగా మూడో బొమ్మ చూడండి. కొంచెం తెలిసినట్టు అనిపిస్తోంది. కాని చెప్పలేరు.
ఎందుచేతనంటే 'అమృతాంజన్' సంస్థవారు విడుదల చేసిన 2012 డైరి ముఖచిత్రం అది. మా అబ్బాయి పంపిన ఈ డైరి చూడగానే ముచ్చటపడి బ్లాగ్ లో అందరికి చూపించాలనిపించిoది . డైరి అనిగాని , సంస్థ పేరుగానీ ముఖచిత్రం మీద లేకుండా చాలా ఉత్సుకతను కలిగిస్తున్నది.ఇలా కొత్తదనంతో నిండిన డైరిని చూసి వారి అభిరుచిని ఎంతైనా మెచ్చుకోవాలని పిస్తుంది. లోపల పేజి లలో ఇల్లాంటి కార్టూన్ లు వారి ఉత్పాదనలు ఎన్నో వున్నాయి. వారి వెబ్ సైట్ చూస్తే తెలుస్తాయి: www.amrutanjan.com
ఆంధ్ర పత్రిక శివలెంక రాధాకృష్ణ గారు 1975 నుండి నాకు అమృతాంజన్ డైరి ఇచ్చేవారు. ఆయన తర్వాతకూడా ఆ సంస్థ వారి డైరిలు నేను పొందగలుగు తున్నాను. ప్రతి సంవత్సరం వారి డైరి ప్రత్యేకంగా వుంటుంది. ఈసారి డైరి కార్టూన్ లతో చూడగానే వెంటనే బ్లాగ్ లో వ్రాయాలనిపించింది. .
am .
No comments:
Post a Comment