" Very good ! Though late, you have brought a bigger one. Now, I can see the numbers without my glasses on !"
***** *****
సృష్టి లో ప్రతి ప్రాణికి కంటి చూపు అవసరం వుంది. మనకైతే మరీను. చూపు లేకపొతే ప్రపంచమే లేదు. ముందు చూపు లేక పోయినా ఫర్వాలేదు గాని, కంటి చూపు మాత్రం చాలా అవసరం. అంచేత కళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు ఒంటికి స్నానం ఎంత అవసరమో, కంటికి కూడా స్నానం అవసరం అని ఎప్పుడో ఆయుర్వేదం గురించి టీవీ లో చెప్తే వ్రాసుకున్నాను. అలాగే రోజూ ఆచరిస్తున్నాను. బాగానే వుంది అనిపించి ఇక్కడ వ్రాస్తున్నాను.
'త్రిఫల' అంటే చాలామందికి తెలుసు. అవి ఎండిన ఉసిరికాయ , కరక్కాయ, తానికాయ. ఇవి పాత కిరాణా దుకాణాల్లో దొరుకుతాయి. వీటిని విడివిడిగా చిన్న చిన్న ముక్కలుగా (శనగ బద్దంత ) చేసి పెట్టుకోవాలి. రాత్రిపూట ఓ గ్లాసుడు గోరువెచ్చని నీటిలో ఈ మూడు రకాలు ఐదేసి ముక్కలు చొప్పున వేసి నానబెట్టాలి. ఉదయానికల్లా, వాటి రసం నీటిలో కలిసిపోతుంది. ఈ నీటిని వడపోసి వాడాలి (టీ కాషాయం వడపోసి నట్టు )
ఉదయం మామూలుగా ముఖం కడుకున్న తర్వాత ఈ త్రిఫల నీటిని కొద్దిగా నోట్లో పోసుకుని పుక్కిలించాలి. అలా పుక్కిలిస్తూ మిగతా నీటిని కొద్ది కొద్ది గా చేతిలో పోసుకుని కళ్ళు మూసుకుని పై రెప్పలను కడగాలి. కడిగిన ప్రతిసారి ఆ తడి చేతి వ్రేళ్ళను తల వెంట్రుకల్లోకి పోనిస్తూ వెనక్కి దువ్వుకోవాలి. ఈ ప్రక్రియ అయ్యాక నోటిలోని నీటిని బయటికి వదిలేయాలి . (అంతకి ముందు వరకూ పుక్కులిస్తూనే వుండాలి). అంతే, కంటి స్నానం తోపాటు పంటి స్నానం కూడా జరిగిపోతుంది.
ఇలా చెయ్యటం వల్ల, సమస్యలు రానీయకుండా పళ్ళు, నోరు, గొంతు శుభ్రపడతాయి. కళ్ళు శుభ్రం గా వుంటాయి. దృష్టిలోపాలు, శుక్లాలను రాకుండా చేస్తుంది. లోపాలు ప్రారంభ దశలో వున్నా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం వుంది. ఆ నీటి తడి, తలకి పట్టించడం వల్ల జుట్టు పెరుగుతుంది. వెంట్రుకలు తెల్లబడ నీయదు అన్నారు గాని, నేను దీనిని ప్రారంభించే నాటికే, నా జుట్టు తెల్లబడి పోయింది.
ఇంట్లో ఒకరిద్దరు ఎక్కువ వుంటే, త్రిఫల ముక్కలను, నీటిని అదే నిష్పత్తిలో మనిషికి ఒక గ్లాసు రసం-నీరు వచ్చేటట్టు తయారు చేసుకోవాలి. అనుభవం మీద , నీటిరసం చిక్కగా/పలచగా ఉన్నదీ తెలిసిపోతుంది.
ఈ ప్రయోగం హానికరం కాదు. ఎవరైనా చేసి చూడవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్ళకి మంచిది. ఈ ముందు చూపువల్ల ముందు ముందు కంటి, పంటి వైద్యుల అవసరం వుండదు.
కళ్ళజోకులు :
1 . నేను కార్టూన్ లు వేయడం ప్రారంభించిన రోజుల్లో ప్రఖ్యాత రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి వెంట విజయవాడ గాంధీనగర్ లో నడుస్తున్నాను. 'బాబు, "నాలుగు కళ్ళు రెండయినాయి.." అని హీరోయిన్ పాడుతుంది. అంటే అర్ధం తెలుసా? ....అంటే, కళ్ళజోడు పగిలిపోయిందని ఏడుపు..,' అన్నారు. ఆయన నవ్వకుండా మనల్ని నవ్విస్తారు.
2. విప్రనారాయణ సినిమాలో : రేలంగి , ఆశ్రమం లో దేనినో కాలితో పొరపాటున తంతాడు. అప్పుడు భానుమతి 'ఏం, కళ్ళు లేవా? ' అడుగుతుంది. దానికి రేలంగి 'కాళ్ళకు కళ్ళు ఉంటాయా?' అంటాడు. రేలంగికి తగిన జవాబు చెప్పాలని ఓసారి తనే కావాలని దేనినో తంతుంది. అప్పుడు రేలంగి 'ఏం, కళ్ళు లేవా?' అని అడుగుతాడు. దానికి భానుమతి 'కాళ్ళ కు కళ్ళు ఉంటాయా?' అని వ్యంగ్యం గా జవాబు ఇస్తుంది. దానికి వెంటనే రేలంగి 'కాళ్ళకు లేకపోయినా, నెత్తికి ఉన్నాయిగా?' అంటాడు
** ** **

No comments:
Post a Comment