Sunday, April 15, 2012

విచిత్రమైన ఓటు !


--బాబు 

2 comments:

Saahitya Abhimaani said...

అద్భుతంగా ఉన్నది సామాజి మాష్టారి పాఠం. కాని అర్ధం చేసుకోగల శక్తి ఉన్న ఓటర్లు ఉండాలి కదా.

ప్రముఖ ఆస్ట్రేలియన్ రచయిత నీవిల్ షూట్ 1950లలో రచించిన "ఇన్ ది వెట్"(In the Wet) అనే నవలలో కొందరికి ఒకటి కన్న ఎక్కువ ఓట్లు వారి వారి అర్హతను అనుసరించి ఉండాలని చక్కగా వాదించారు. దానివల్ల మాబోక్రసీ కాకుండా కొంతలో కొంత ప్రజాస్వామ్యం సవ్యంగా ఉండవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డట్టుగా కనిపిస్తున్నది.
ఆయన చెప్పిన ఐడియాను మనకు అన్వయిస్తూ ఇలా చేస్తే ఎలా ఉంటుందిది నాకు అప్పుడప్పుడూ అనిపిస్తుంది
*18 నిండిన అందరికీ ఒక్క సామాన్యమైన ఓటు ఆపైన
*గ్రాడుయేట్ అయిన వాడికి రెండు ఓట్లు
*పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యిన వాడికి మూడు ఓట్లు
*స్వంతంగా సంపాయించుకున్న ఇల్లు ఉన్నవాడికి మరొక ఓటు
*ఇద్దరే పిల్లలు ఉన్న వారికి మరొక ఓటు
*ఇంకం టాక్స్ ఒక పరిధి మించి కడుతున్న వారికి మరొక ఓటు

ఇలా చెయ్యటం వల్ల కొంతలో కొంత చదువుకున్న వాళ్ళ ఓట్లకు ఎక్కువ విలువ ఉంటుంది. ఇక్కడ ఉద్యోగం, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్వంత ఇల్లు వంటివి కఠినంగా నిర్వచించగలగాలి.

పైన వ్రాసినవన్నీ కూడ కొన్ని అర్హతలను అనుసరించి ఒక్క ఓటు కంటే ఎక్కువ ఇవ్వాలి. కాని ఆ అర్హతలను ఎవరు రికార్డ్ చెయ్యాలి. ఈనాటి అవినీతి అవినీతి ప్రజల మధ్య తద్వారా అవినీతి మయమైన బ్యూరోక్రసీ తో జరిగే పనేనా. దేశం మొత్తానికి అక్షరాశ్యత ఎక్కువ అని గొప్పలు చెప్పుకునే కేరళలో ఒక్క జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు జరిపి చూస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. కాని పిల్లి మెడలో గంట కట్టేదెవరు.

బాబు said...

శివ గారు,
మీ సూచనలు చదివాక ఇతరుల దగ్గరనుంచి కూడా కొన్ని సూచనలు రావొచ్చని అనుకున్నాను కాని రాలేదు.
నా ఆలోచనలు కూడా మీతో పంచుకుంటాను.

* ఓటు హక్కుకు కనీస అర్హత 10 వ తరగతి ఉతీర్ణత (గట్టెక్కడం) వుండాలి.
ఈమాత్రం చదువు లేనివారికి, ఓటు హక్కు, దాని విలువ, పవిత్రత రాజ్యంగం లో దాని సంబంధిత విషయాల గురించి శిక్షణా తరగతులు (సాయంత్రం బడులు) నిర్వహించాలి. బొధన, పరీక్షలు, జవాబుల సేకరణ నొటిమాటలతోనే జరగాలి. హాజరు పట్టీ వుండాలి. ఈ శిక్షణలో గట్టెక్కినవారికే ఓటు హక్కు పత్రం ఇవ్వాలి. ఈ కార్యక్రమం ఎన్నికల సంఘం పరిధిలో వుండాలి. ఈవిధంగా ఓటుహక్కు తమాషా విషయం కాదని అందరికి తెలియాలి. ఈ శిక్షణ వల్ల ఓటరుకు విశ్లెషణా శక్తి, ఎన్నికల్లో నిలబడ్డవారిని నిలదీసి అడిగే ధైర్యం వస్తాయి.
*ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఏ కారణంచేతనైనా రాజీనామా చేస్తే, ఉప ఎన్నికల్లో వారు మళ్ళీ నిలబడకూడదు.
*డబ్బు తీసుకుని ఓటు వేసేవారికి, ఓటు హక్కు తీసేయాలి.
ఇలా....ఎన్నో ఆలోచనలు....
ఇతరుల దగ్గరనుండి కూడా ఇలాంటి ఆలోచనలు సేకరించే ప్రయత్నం చేద్దామా శివగారు?