"ఒరే, నిత్యానందం! మీ ఆవిడ లేచిపోయిందట . మా ఆవిడ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది!"
నిత్యానందం పక పకా నవ్వేడు ."మా ఆవిడ కూడా ఇప్పుడే ఫోన్ చేసింది . మీ ఆవిడ చెప్పిన కబుర్లు విని వినీ విసుగెత్తి అక్కడనుంచి లేచి పోయిందట !"
ఇది హాస్యమ్. ఇక నిజ జీవితంలో - వయసులో వున్న ఆడపిల్లలు ప్రేమ -పెళ్ళీ పేరుతో లేచిపోతున్న విషయాలు అడపా దడపా మన చుట్టూ వున్న సమాజం నుంచి వినబడుతోనే వున్నాయి .
ఈ విషయం మీద ఓ నెల క్రితం ఓ పత్రికకు పై రెండు కార్టూన్ లు వేసి పంపితే, ఆ పత్రిక "సారీ " చెప్పింది .
సరే, ఈ కార్టూన్ లు నా బ్లాగ్ లో ఒక వ్యాసం లాంటిది వ్రాసి జోడించి ప్రచురించుదామని అనుకున్నాను. కాని,
అది వాయిదా పడుతూ వచ్చింది . మొన్న 3-6-2013 ఈనాడు దిన పత్రికలో "దారితప్పి పోతున్నారు" అంటూ
ఓక వార్త వచ్చింది . ఇక వేరే వ్యాసంతో పనిలేకుండా నా కార్టూన్ లను ఈ వార్తకు జోడించి ఇప్పుడు ప్రచురించాను
"ఈనాడు" వారికి కృతజ్ఞతలు .
కాబట్టి , అమ్మాయిలూ జాగ్రత్త ! ప్రేమ-పెళ్లి విషయాల్లో ఊబిలో కాలేయ్యకండి !!
2 comments:
పబ్కి తీసుకు వెళ్ళి పబ్బం గడుపుకుంటాడు అంటూ మాటలతో గారడీ చేసి జరుగుతున్న విషయాలను చక్కగా కార్టూన్ రూపేణా విశదపరచారు. అద్భుతం దుర్గా ప్రసాదు గారూ.
పూర్వీకులు మూఢాచార పరాయుణులు, అనేక దురాచారలలో ముణిగిపోయి సమాజాన్ని భ్రష్టు పట్టించారు అని తమను తామే విజ్ఞాన ఖనిగా భావించుకుని తలెగరేసి మాట్లాడేవాళ్ళందరూ గమనించుకోవాల్సిన, తెలుసుకు తీరవల్సిన విషయం ఏమిటి అంటే ఎంతో పురోగతి సాధించాం అనుకునే మానవుడు కొత్త రకాల దుర్గుణాలను దురచారాలను మరుగుతున్నాడు. అలాంటి దురాచారమే, దురలవాటే ఫేస్ బుక్ లాంటివాటికి బానిసలవ్వటం ఎస్ ఎం ఎస్ లు ఎప్పుడు చూసినా పంపించుకుంటూ సమయం వృధాచేసుకోవటం ఆవతలి వారి సమయం వృధా చెయ్యటం. పిల్లలకి ఈ విషయాలను తెలియచెయ్యాలి, స్కూళ్ళు కాలేజీల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలి. అప్పుడుకాని ఈ ప్రేమాయణాలుగా చెలామణి అవుతున్న అవకతవక వ్యవహారాలకు అడ్డుకట్టపడి, అల్లరి మూకలు అదుపులోకి రారు.
ధన్యవాదాలు!
Post a Comment