సికిందరాబాద్ లో 8-7-2013 సోమవారం అమావాస్య ఉదయం 6-7 గంటల మధ్య 'సిటీ లైట్ హోటల్ ' భవనం కుప్ప కూలి పోయింది ఆ సమయానికి అందులో 40 మంది దాకా వున్నట్టు, ఇప్పటివరకు 17 మంది చనిపోయినట్టు మిగిలినవారు గాయాలతో వున్నట్టు, వార్తలు చెబుతున్నాయి. ఇది 50 ఏళ్ళ క్రితం కట్టినదట .
రంజాన్ మాసం ప్రత్యెక వంటకాల కోసం పెద్ద పొయ్యి( బట్టీ) ఏర్పాటు చెయ్యటానికి ఓ లారీడు ఇటికలను మొదటి అంతస్తు కు చేర్చి పని పూర్తీ చేసారు క్రితం రొజు. అప్పటికే అ భవనం ఇటీవల వానలకి బాగా నానిపోయి వున్నదట ఇవేవి చూసుకోకుండా , హోటల్ వాళ్ళు 'లైట్ ' గా తీసుకుని పొయ్యి వెలిగించారట ఆ వేడికి, బరువుకి నానిన గోడలు కూలపడ్డాయట ఇలాంటి పాత కట్టడాలు జంట నగరాల్లో చాలా వున్నాయని గుర్తించటం మొదలు పెట్టారు కూల్చడం కూడా చెస్తున్నారు.
పాత కట్టడాలు ఒక్క జంట నగరాల్లలోనే కాదు, రాష్ట్రం లో అన్ని ప్రాంతాలలో వున్నాయి. ముఖ్యం గా బడి కోసం నడప బడుతున్న పాత భవనాలు వేగిరం తనిఖీ చెయ్యాలి. ఇవన్నీ దాదాపు స్థానిక ప్రభుత్వాల పాలనలో వున్నవె. వాటిని గుర్తించి వెంటనే కూలిచివేసి కొత్తగా భవనాలు కట్టాలి -- అని నేను వ్రాస్తే హాస్యం గా వుంటుంది .
ఎందుచేత నంటే - సదరు భవనాలకి మరామత్తు చేయటానికే వారి వద్ద పైసలు లెవు. ఇక కొత్త భవనాలకి తావెక్కద.?
ఇక పౌరుల సొంత పాత భవనాల విషయా నికొస్తే - కూలగొట్టి మళ్ళీ కట్టుకునే స్థోమత ఎంతమందికి వుంటుంది? అందుచేతనే వారు పుర/నగర పాలక సంఘం వారిని ఏమార్చి తప్పించు కుంటున్నారు . పాత భవనాల యజమానులకి ఆర్ధిక సాయం అందించే ఏర్పాటు వుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లెదు.
ఈమధ్య కొన్ని అపార్ట్ మెంట్ లు చూస్తోంటే - ఇవి పదేళ్ళ క్రితం కట్టినవేనా , మరీ పురాతన భవనాల్లా వున్నాయే అనిపిస్తున్నాయి. వాటి నాణ్యత అట్లా వుంటోంది కాస్తో కూస్తో స్వంత పర్యవేక్షణ లో కడుతున్న ఇళ్ళే ఎక్కువకాలం నిలబదతాయి అనిపిస్తోంది !
ఏమయినా ప్రయివేటు భవానాలు కూలితే ,ఆయా యజమానుల మీద కేసులు చక చకా పెట్టొచ్చు . కాని
ప్రభుత్వ ఆధీనం లో వున్న పాత భవనాల చెప్పా పెట్టకుండా కూలితే?.... 'నేను ముందే చెప్పా! కాని నా మాట ఎవరూ వినలేదు' అనేవాళ్ళే ఎక్కువ మంది వుంటారు.
బాంబుల భయం, ఉద్యమాల్లో అరాచక శక్తులవలన భయం, ప్రయాణాల్లో ప్రమాదాల భయం, ఆసుపత్రికి వేళితే పోతామన్న భయం - ఇప్పుడు పాతభవనాలు కూలుతాయన్న భయం! క్షణ క్షణం బతుకు భయం!!
అయిపోయింది .
UVVS శ్యామసుందర్ (Rerd. IRS) గారు అంటూ వుండేవారు 'Prasad, we live by accident' అని. ఇలాంటి ఆకస్మిక ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు ఆయన మాటలు గుర్తుకు వస్తాయి . ఈమాటలు ఆయన ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం చెప్పినవి.
ఏమయినా ఎవరి జాగ్రత్తలో వారు వుండడం మంచిది.

No comments:
Post a Comment