Sunday, February 1, 2015

శ్రీ బాలాంత్రపు రజనీకాంతారావు గారు

         వంద వసంతాలు చూసిన   వారు, ఎందఱో గాయక గాయకీ మణులకు మార్గదర్శకులు , సంగీత దర్శకులు , ఎందరికో గురుదేవులు , ఎన్నో పాటలు వ్రాసి , స్వరపరచి  అలనాటి తెలుగు నేలను అబ్బురపరచిన గాయకులు 
శ్రీ బాలాంత్రపు రజనీకాంతారావు గారు!  31-1-2015 న వారు తమ నూరవ పుట్టినరోజు  తమ కుటుంబ సభ్యులు, బంధు  మిత్రులు , సంగీత ప్రముఖులు , అభిమానుల  మధ్య వేడుకగా  జరుపుకొన్నారు. 
         ఆ రోజు సాయంత్రం  వారికి  గొప్పగా సన్మాన   జరిగింది . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  శాసన సభ ఉపాధ్యక్షులు 
శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు . 

          ఆ రోజు ఉదయం మా ఇంటికి సమీపంలో వున్న వారి నివాసానికి  వెళ్ళాను . వారికోసం హాల్లో వేచివున్నాను. పది నిముషాల తర్వాత పెద్ద స్వరం వినిపించింది . వెనక్కి తిరిగి లేచి నిలబడ్డాను .  శ్రీ రజనీకాంతారావు గారు పాడుతూ వస్తున్నారు. ఆయన్ని వారి కుమారులు శ్రీ హేమచంద్ర గారు మెల్లగా నడిపించి 
తీసుకొని వస్తున్నారు. ఆ సమయం లో   వారి గాత్రం అనుకోకుండా వినడం గొప్ప అదృష్టం అనిపించింది . వారికి  వయసు మళ్ళినా , వారి స్వరానికి ఏమాత్రం బలం తగ్గలేదు !  వారిని కుర్చీలో  కూర్చోబెట్టారు .  నేను వారికి పాదాభివందనం చేసి,  నా కార్టూన్ ల పుస్తకం "ఇ  వేమన పద్యాలు " చేతికి అందించాను . వారు స్వీకరించారు . వారి కుమారులు, శ్రీ హేమచంద్ర గారు నన్ను వారికి పరిచయం చేసారు . వారి అనుమతితో ఫోటోలో తీశాను . వారితో ఫోటోలు దిగాను . అదే సమయంలో  శ్రీ వి.ఎ. కె. రంగారావు గారు విచ్చేశారు .  ఆయన రావటంతోనే  వారికి .... ప్రణామాలు చేసి పలకరించారు . ఆయన రాక సందడి పెంచింది . ఆ ఇద్దరినీ కలిపి ఫోటో లు తీశాను . 
నా   జీవితం లో ఇదొక మరపురాని రోజు . 

        తెలుగు సినిమా రంగం ప్రారంభ దశలో వున్న కొందరి ప్రముఖులలో  శ్రీ బాలాంత్రపు రజనీకాంతారావు గారు ఒకరు. ఎన్నో సినిమా లకు   పాటలు  వ్రాసారు ,  స్వరకల్పన చేసారు . పాటలు   పాడారు .ఆనాటి  రేడియో శ్రోతలకు  వీరి పేరు తెలియని వారు లేరు . 
         మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  శ్రీ బాలాంత్రపు రజనీకాంతారావు గారికి తగిన గుర్తింపు దక్కేలా చేయగలదని ఆశిద్దాం!

2 comments:

కమనీయం said...


నూరు వసంతాలు పూర్తిచేసిన ,ప్రసిద్ధ కవీ,వాగ్గేయకారుడు,రేడియో,సినిమాల్లో సంగీతం నిర్వహించిన ,ఇంకా ఎన్నో విధాల ప్రసిద్ధి చెందిన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారికి జేజేలు.ఆయనకు ప్రభుత్వం తగిన గుర్తింపు,గౌరవం ఇవ్వకపోడం శోచనీయం. ప్రజలైనా ఆదరించినందుకు సంతోషం.

కమనీయం said...


నూరు వసంతాలు పూర్తిచేసిన ,ప్రసిద్ధ కవీ,వాగ్గేయకారుడు,రేడియో,సినిమాల్లో సంగీతం నిర్వహించిన ,ఇంకా ఎన్నో విధాల ప్రసిద్ధి చెందిన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారికి జేజేలు.ఆయనకు ప్రభుత్వం తగిన గుర్తింపు,గౌరవం ఇవ్వకపోడం శోచనీయం. ప్రజలైనా ఆదరించినందుకు సంతోషం.