Thursday, February 26, 2015

నరకులు !

పనస చెట్టు - నిండుగా  పిందెలు !

చెట్టు కొమ్మలు కరెంటు తీగలకు అడ్డువస్తున్నాయని  ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి నిర్ధాక్షిణ్యంగా చెట్టు కొమ్మలను  నరికిపారేశారు . 

ఇది వేప చెట్టు . చాలాసార్లు నరికివేతకు గురి అయ్యింది !- పనస చెట్టు లాగె.. 

ఇప్పుడు మళ్లీ  నరికివేతకు గురి అయ్యింది! 

మొక్కలను నాటండి , చెట్ల ను పెంచండి అంటారు నేతలు . అలాగేనని మొక్కలను నాటి రోజు నీళ్ళు పోసి పిల్లలను పెంచినట్టు నలుగు అయిదు ఏళ్ళు  పెంచితే, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి నలుగు ఐదు నిమిషాల్లో  నరికేస్తూ వుంటారు .  వచ్చేది ఎండాకాలం . నీడ నిచ్చే చెట్లను నరకడం ఎంతవరకు సమంజసం? వచ్చేది ఉగాది . పూతకు  వచ్చిన వేపచేట్టును ఎలా నరికివేసారో  చుడండి!  దీనికి పరిష్కార మార్గంగా, కరెంటు తీగలకు  కొమ్మలు అడ్డం వస్తున్న మేరకు  ఏదైనా మాస్క్ లాంటిది తొడగ వచ్చు కదా?
(ఫోటోలు : శాంతకుమారి )

No comments: