పిళ్లా సుబ్బారావు గారు 1962 నుంచి నాకు పరిచయం . ఆయన అప్పటికే 'ఆంధ్ర ప్రభ' దినపత్రికలో "చిత్ర జగత్" శీర్షికతో పాకెట్ కార్టూన్లు వేస్తూ ఉండేవారు . అప్పట్లో ఆ కార్టూన్లు గొప్ప సంచలనం . దానికి ముందే , 'పారిపోయిన బఠానీ ' పిల్లల నవల వ్రాసి రచయితగా కూడా గుర్తింపు పొందేరు . వారు సినిమా పబ్లిసిటి రంగంలో కుడా వున్నారు . 'గీతా సుబ్బారావు' గా అందులోనే స్థిరపడి పోయారు . నేను 1962 లో , సినిమా ప్రకటనలు , పోస్టర్ డిజైన్ లు కొన్ని సినిమాలకు వేసాను . అప్పుడే ఆయనతో పరిచయం .
1962 లో "బాపు ఆర్టు ఎక్సిబిషన్ " విజయవాడ లో జరిగింది . దాని నిర్వహణ కార్యక్రమాలు సుబ్బారావు గారే చూసారు --శ్రీ కాట్రగడ్డ నర్సయ్య అండదండలతో . అందులో నేను కూడా పాలుపంచుకున్నాను ( వయసు 16 ఏళ్ళు ). మరునాటికి ప్రదర్శనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న ఆ రాత్రి బాపు గారు విచ్చేసి మమ్మల్ని అందరిని
అభినందించారు .కరచాలన చేసారు . బాపు గారు వేసిన వేలాది బొమ్మలు ప్రదర్శన కోసం నా చేతులతో అలంకరిస్తుంటే , నేను కూడా బొమ్మలు , కార్టూన్ లు వేయాలనిపించింది . నాకు గురువు లాంటి మిత్రుడు , కీ. శే . క్యానం భగవాన్ దాస్ కూడా , సినిమా పబ్లిసిటీ మానేసి కార్టూన్ లు, బొమ్మలు సాధన చెయ్యమని ప్రోత్సహించాడు . ఆ విధంగా బాపు గారి బొమ్మలు , నా జీవిత గమనాన్ని మార్చివేసింది .
సుబ్బారావు గారు, చలన చిత్ర ప్రచార రంగం లో వుండిపోయారు . నేను హైదరాబాద్ లో వున్నప్పుడు , అప్పుడప్పుడు కలుస్తూ వుండేవాళ్ళం . చాలా ఏళ్ళ తర్వాత, పోయిన సంవత్సరం విజయవాడలో 3 వ 'ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ' జరిగినప్పుడు అక్కడ కనిపించారు . ఫోటో దిగాము .
సుబ్బారావు గారు! మీకు శుభాకాంక్షలు

No comments:
Post a Comment