Friday, April 1, 2011

TELGOOS కు ఉగాది శుభాకాంక్షలు

ఇవ్వాళ రేపు (అంటే ప్రస్తుతం అన్న మాట) "నాకు తెలుగు రాదే!" అని చెప్పుకుని మురిసిపోవటం ఘోప్పగా ఐపోయింది కదా! అలా తెలుగు చదవలేని తెగులు మనిషి , క్షమించాలి, TELGOO మనిషి అవస్థ మనకొద్దు.

మనమందరం తెలుగు వాళ్ళం హాయిగా తెలుగులో మాట్లాడుకుందా, తెలుగులో నవ్వుకుందాం. ఏమంటారు. అవుననే అంటారు నాకు తెలుసుగా!

అందరికీ, ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు

5 comments:

SHANKAR.S said...

బ్లాగ్లోకానికి స్వాగతం గురువుగారూ. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు
(అన్నట్టు మీ బ్లాగులో మొదటి కామెంట్ నాదేనా? :) )

బాబు said...

శంకర్ గారూ. ధన్యవాదాలు. అవును మీదే నా బ్లాగులో మొట్టమొదటి వ్యాఖ్య .

కార్టూన్ల బాగోగుల మీద మీ అభిప్రాయాలు తెలుపగలరు.

Saahitya Abhimaani said...

అద్భుతమైన కార్తూంతో మీ బ్లాగ్ మొదలు పెట్టారు "బాబు" గారూ.

బ్లాగులోకానికిదే స్వాగతం.

మీ బ్లాగ్ లో ఎన్నెన్నో, మరెన్నో కార్టూన్లు చూడాలని ఆతృతతో ఎదురుచూస్తున్న అభిమానులు ఎందరో ఉన్నారు. మీ పాత కార్టూన్లు కూడా ప్రచురించి మమ్మల్ని అందరినీ అలరించ ప్రార్థన

జ్యోతి said...

బ్లాగ్లోకానికి సుస్వాగతం బాబు గారు..

SRRao said...

బాబు గారూ !
ఈ ఉగాదికి బ్లాగులోకంలో ఉషోదయం మీ రాక. బ్లాగులోకాన్ని సుసంపన్నం చెయ్యడానికి విచ్చేస్తున్న మీకిదే మా హార్థిక స్వాగతం.