మనం క్రికెట్ వరల్డ్ కప్ గెలిచేసాం. మన కుర్రాళ్ళకి రోడ్ల నిండా క్రికెట్ ఆడటానికి మరింత ఉత్సాహం, కానీ ఈ ఉత్సాహంలో మన "యువసేన" కొంతలో కొంత చుట్టుపక్కల వాళ్ళ వల్ల జరిగే ధ్వని కాలుష్యం, బంతి బుల్లెట్లా దూసుకెళ్ళి ఇళ్ళ కిటికీలు, కారు అద్దాలు పగలేయ్యటం జరగకుండా చూసుకోవద్దూ. పై బొమ్మలో చూడండి యువసేన ఆడిన క్రికెట్ బంతి గది అద్దం బద్దలుకోట్టుకుంటూ రెండు గదులుదాటి పడింది. యువసేన పారిపోయింది. ఆ అద్దాన్ని మార్చడం అంటే ఎంత తలనోప్పోకదా! వడ్రంగి మాష్టారు ఓ పట్టాన ఇలాంటి చిన్నపనులకు వస్తారా? పనిచేసే మనిషి దేవుడు - పాడుచేసే వాడు ...... ఏమని పిలవాలి?? ఆటతనాన్ని మెచ్చుకోవచ్చు -- ఆటవికతనాన్ని ?????
--బాబు
1 comment:
ఈ బ్లాగు ప్రపంచానికి స్వాగతం దుర్గా ప్రసాద్ గారు.
ఇప్పుడే మీ బ్లాగు చూస్తున్నాను. మీ కార్టూన్స్ నవ్వించడంతో పాటూ ఆలోచింపచేసేలా ఉంటాయి కూడా.
మీ కలం మరిన్ని కార్టూన్స్ని మా ముందుకు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
గీతిక బి
Post a Comment