(ఇది నా రెండవ కార్టూన్ 1963 అక్టోబరులో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురితం)

పై బొమ్మ ఆంధ్ర ప్రభలో చిలుకమ్మ వాడి చూపులు అన్న కాప్షన్ తో మార్చ్ 1963 లో ఆంధ్ర ప్రభ వార పత్రికలోవచ్చినది
=========================================================బొమ్మలు చూసి వేయడం నాకు పదేళ్ళ వయసులోనే అబ్బింది. ఆరో తరగతి లో వుండగా బళ్ళో అడిగినవాడికల్లా బొమ్మలు వేసి ఇచ్చేవాడిని. అప్పటికి నాకు వచ్చిన బొమ్మలు రెండే రెండు. ఒకటి. సంజీవి పర్వతాన్ని తెస్తున్న ఆంజనేయస్వామి. రెండోది. అర్జునుడికి గీతను ఉపదేశిస్తున్నకృష్ణుడు. ( మా ఇంట్లో కాశీమజిలి కథల పుస్తకం వుండేది. దాని అట్టమీద బొమ్మ అది ) 1955-60 లో బెజవాడ లో ఓ పొట్టి చిత్రకారుడు ఉండేవాడు. సన్నగా నల్లగా ఉండేవాడు. మసిగుడ్డలాంటి చిరుగు వస్త్రం నడుముకు వుండేది. ఆంజనేయస్వామి బొమ్మను బెజవాడ రోడ్ల మీద బొగ్గుతోను, చాక్పీసు, రంగులతో వేసేవాడు. ఆ బొమ్మ మీద కాణీలు అర్ధణాలు వేసేవారు జనం. అతనికి పిచ్చి అనేవారు కొంతమంది. అతను వేస్తూవుంటే నేను చూస్తూ ఉండేవాడిని. అలా ఆంజనేయస్వామి బొమ్మ వేయడం నేర్చుకున్నాను. తర్వాతనుంచి సినిమా నటీనటుల ముఖాలు బొమ్మలు చూసివేయడం నేర్చుకున్నాను.వీటిని మిత్రుడు భగవాన్(క్లిక్) చూసి కార్టూన్లు వేయడం చెప్పాడు. ఇవే నా మొదటి కార్టూన్ లు.
మొట్టమొదటి కార్టూన్ ఆంధ్ర సచిత్ర వార పత్రికలో సెప్టెంబరు 1963 లో ప్రచురించబడింది ఆ గీతలు చూస్తె ఇప్పుడు నాకు నవ్వొస్తుంది మరి 1967 లో వేసిన చిలుక బొమ్మ చూడండి. ఎలావుందో. ఇప్పుడు అంతా ఓపికగా వేయాలనిపించదు.

=======================================================================================
(దాదాపుగా ఐదు దశాబ్దాల నాటి పత్రికల కట్టింగులవటం వలన అప్పట్లో తెల్లగా ఉన్న కాయితాలు కాలక్రమాన రంగు మారిపొయ్యాయి)
=======================================================================================
No comments:
Post a Comment