నేను వెంకటరమణను మాట్లాడుతున్నాను. ఆగష్టు 15 2011 నుంచి మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అప్పుడెప్పుడో 1972 లో "బాబు" గారు నన్ను సృష్టించి మీ ముందు ఉంచారు. అప్పుడు అందరూ నన్ను భలే లైక్ చేశారు.
ఇప్పుడు ఆయనెవరో శివరామప్రసాద్ గారుట అక్కడ ఇక్కడ పడి ఉన్న నా జీవిత భాగాలన్నీ ఒక చోట పోగేసి మళ్ళీ ఇలా మీ ముందుకి తెస్తున్నారు.
అందరూ తుమ్ము మంచిది కాదు అంటూ ఉంటారు. కాని, ఎందుకో నాకైతే తెలియదు. నా తుమ్ము వల్ల ఓ సారి, నా చెంప పగిలింది కూడానూ!

నేను తుమ్మితే మాత్రం పన్లు అయిపోతాయి"ట". నేను నమ్మను....కాని, కొందరికి దార్లో డబ్బులు దొరకటం, ఒకమ్మాయికి పరీక్షలో చదివినవే రావటం, మరోకాయనకు, అనుకున్న కాంట్రాక్ట్ రావటం చూసి ఇవన్నీ నిజమే అని ఆ రౌడీ గాళ్ళు కూడా నమ్మేశారు. ఆ చివరికి అమెరికా వాళ్ళు కూడానండోయ్! వాళ్ళు రాకెట్ ఎగరేసేప్పుడు, నేను తుమ్మాలాట! అప్పుడు అది బాగా ఎగురుతుందట.
అన్నట్టు నా తుమ్ముల గురించి పేపర్లో కూడా వేశారు. పక్కింటాయన పేపరు, నేను కూడ చూసేశాను. తెలుగు వాళ్ళ ఇప్పుడంటే ఎవరి పేపరు వాళ్ళు కొనుక్కుంటున్నాం కాని, అప్పట్లో కొనటమా ఏమన్నానా!
మా బామ్మ అంటూనే ఉన్నది "నే వాడికి వెంకన్న అని పేరు పెట్టిన వేళా విశేషం అంతానూ" అవటాని. హేమిటో! చివరికి నా పెళ్ళిలో కూడా నాకు తుమ్ము తప్ప లేదు.
ఊరికే ఊరించటం నాకు అంతగా ఇష్టం లేదు. రేపు ఇదే టైముకి ఇక్కడ రండి నా కథ మళ్ళి మొదటికి వస్తుందిట.
అ....మా..త...పా (ఏమిటి మాట తడబడుతున్నది) ....అదీ సంగతి....అదుగో మాటల్లో పెద్దాయన "బాబు" గారే వచ్చేసారు. సారీ సర్, మీరు బొమ్మలేస్తూ అలసిపోయి అలా వెళ్ళారు, నేను కొద్ది కొద్దిగా నాగురించి నేనే చెప్పుకుంటున్నాను. నా కథ మళ్ళీ మొదలవుతున్న సందర్భంగా, అసలు నన్ను గీయాలని ఎందుకు అనుకున్నారు, మెకన్నా'స్ గోల్డ్ కీ నా కోల్డ్ కీ ఏమిటి సంబంధం ఈ బొమ్మల ధారావాహిక ఎలా మొదలెట్టారో , కథా కమామిషు చెప్పరూ....ప్లీజ్....ప్లీ....
*****************************************************
వార్నీ వెంకటరమణా ఇప్పుడూ తుమ్మటమేనా!
మొదట్లో అంధ్ర సచిత్ర వార పత్రికకు వారానికి రెండో , మూడో కార్టూన్లు పంపేవాణ్ణి. ఒకటో, రెండో అచ్చు అవుతూ ఉండేవి. తర్వాత పులిచెర్ల గారి కార్టూన్లు వారానికి ఐదో ఆరో అచ్చు అవుతూ వుండేవి. ఈ విషయం గురించి జయదెవ్ కి వ్రాశాను. అవును ప్రసాద్, ప్రతివారం పత్రికకు బోలెడన్ని కార్టూన్ లు పులిచెర్ల దగ్గరనుంచి వస్తాయట. శివలెంక రాధాక్రిష్ణ గారు అతనికి "ఐడియాల నిధి" అని పేరు పెట్టారట, అందుచేతే అతని కార్టూన్ లు ప్రతివారం చాలా చాలా అచ్చు అవుతున్నాయి అని జయదెవ్ నాకు బదులిచ్చారు .
వెంకన్నాస్ కోల్డ్ ఎలా వచ్చింది -అంటే....

అప్పట్నించి నేను కూడా వారానికి ఏడు నుంచి పది దాకా పత్రికకు కార్టూన్ లు పంపడం మొదలెట్టేను. నా కార్టూన్ లు కూడా ఎక్కువ పడటం మొదలుపెట్టాయి. 1970 లొ కాబోలు, పత్రిక నుంచి ఒక ఉత్తరం వచ్చింది. "ప్రచురణకి ఎంపికయిన మీ కార్టూన్ లు మా దగ్గర చాలా నిల్వ ఉన్నాయి. వాటి ప్రచురణ గురించి ఏదయిన మార్గం సూచించండి" అని. ఈ విషయం మిత్రుడు భగవాన్ కి చెప్పాను. నీ కార్టూన్ లు వాళ్ళకి బొరుకొట్టుంటాయి, ఇక పంపడం మానేయ్ వోయ్ " అన్నాడు.
వెంటనే పత్రిక వాళ్ళకి జవాబు రాసాను - "మీకు సూచనలు ఇచ్చేటంతటి వాణ్ణికాను. సంపాదకులే తగు నిర్ణయం తీసుకోగలరు. నా వంతు నేను కొంతకాలం కార్టూన్ లు పంపడం మానేస్తాను". అలా వాళ్ళకు జాబు వ్రాసి, పత్రికకు గతం లో పంపిన కార్టూన్ల జాబితా తీసి చూసాను. ప్రచురణ కావలిసిన కార్టూన్ లు 200 పైగా కనిపించాయి.
సరే, వెంకటరమణా! ఆపు ఇప్పుడు తుమ్మకు... అసలు కథలోకి వస్తే, భగవాన్ నేను, సత్యం, శ్రీరామచంద్ర మూర్తి,బెజవాడ లీలామహాల్, నవరంగ్ సినిమాహాళ్ళలో ఇంగ్లిష్ సినిమాలు తెగ చూసేవాళ్ళం. ఆప్పుడు ఒకసారి "బ్రాస్ బాటిల్" అనే సినిమా చూసాము. టోనిరెండాల్ నటించిన హాస్య చిత్రమది. అత్భుత దీపం లాంటి కథ.ఇప్పుడు ఖాళీయే కదా, బొమ్మల కథ వేస్తే ఎలావుంటుంది - అనిపించింది.

బ్రాస్ బాటిల్ ని కాపీ కొట్టడం ఎందుకు అనిపించింది. అప్పుడే మెక్కన్నాస్ గోల్డ్ సినిమా వచ్చింది. ఆఫీసు ఫైళ్ళ మూలంగా నేను ఎప్పుడూ జలుబుతో బాధ పడుతూవుండేవాణ్ణి. నా స్నేహితులతో జలుబుతోనే ఆ సినిమా చూశాను.
అప్పుడే వెంకన్నాస్ కోల్ద్ పేరు బుర్రలోకి జొరపడింది.
తర్వాత నింపాదిగా కథ ఆలోచించడం మొదలెట్టాను. భగవాన్ కి ఈ కథ చెప్పేను. ఏం బావొలేదు అన్నాడు. బొమ్మల కథ వేసిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను. మొత్తానికి బొమ్మల కథ పూర్తి చేయడానికి మూడునెళ్ళకు పైగా సమయం పట్టింది.భగవాన్ కి చూపించాలనుకున్నాను. కాని అతను ఏమయిన మార్పులు చెపితే? మళ్ళీ తిరిగి వేయడం చాలా కష్టం అనిపించింది. అందుకే ఎవరికి చెప్పకుండా పత్రికకు పోస్టులో పంపేను.
నెలలు గడుస్తున్నాయి కాని దాని ప్రచురణ సంగతి తెలియలేదు. అయ్యో, భగవాన్ కి చూపించి మార్పులు చేసి పంపివుంటే బాగుండేదేమో - అనిపించింది. ఈ ఉత్కంఠ భరించలేక జయదేవ్ కి రాసేను. రాధ క్రిష్ణ గారి బ్రీఫ్ కేస్ లొ నీ బొమ్మలకథ భద్రంగా వుంది. తొందరగా ప్రచురించడానికి ప్లాన్ చేస్తున్నారు అంటూ చల్లని కబురు రాసేరు జయదెవ్.
మా చెల్లెలి పెళ్ళికోసం కొంత అప్పు చేశాం . అప్పు తీర్చగా ఒకరికి ఓ ఐదువందలు బాకీ వుండిపోయింది.అది తీర్చడానికి సమయం కలిసిరాలేదు. మాకు అప్పు ఇచ్చిన బంధువు, తనకు అత్యవసరంగా డబ్బు కావాలని, తన బాకీ తీర్చమనీ ఆయన బాధ చెప్పుకున్నాడు. ఈ సమస్యకు పరిష్కారం ఏవిటా అనుకుంటూ ఉండగా , అదే రోజు పత్రిక నుండి ఉత్తరం వచ్చింది-- "వెంకన్నాస్ కోల్డ్ ప్రచురణకు ఎంపిక అయింది. ఇందువెంట రూ. 500/- చెక్కు పంపుతున్నాము" --అని. ప్రచురణ ప్రారంభించక ముందే పారితోషికం పంపేరు!! అప్పుడు చాలా సంతోషం వేసింది. అది మరపురాని సంతోషం.మా సమస్య ఆ విధంగా సులువుగా పరిష్కారమయింది!
మా భగవాన్ చాలా సంతోషించేడు. కాని బొమ్మలు బాగా వేసివుండల్సింది అన్నాడు. విమర్శించకుండా ఉండేవాడు కాదు. బాగా సాధించేవాడు. అదే నా సాధనకు మార్గం అయింది. దీని ప్రచురణ సమయం లో శీలా వీర్రాజు గారు " "బొమ్మలు బాగా గీస్తున్నారు" అన్నారు. ఒకసారి జయదేవ్, నేను పులిచెర్ల (డా. పులిచెర్ల సాంబశివరావు) కలిసి కార్టూన్ లు వేసాం ఆంధ్ర పత్రిక లో. *హైదరాబాద్ బదిలీ ( 1972 ) అయిన తర్వాత అక్కడ యోగాసనాలు కొంత నేర్చుకుని జలుబు తగ్గించుకున్నాను.
*****
ఈ బొమ్మల కథను బ్లాగ్ లో ప్రచురించడానికి మిత్రులు కప్పగంతు శివరామప్రసాదు గారి (సాహిత్య అభిమాని బ్లాగ్) శ్రమ, ఒత్తిడి (రెండూ ఆయనవే) చాలా ఉన్నది. ప్రకటన దగ్గర నుంచి ధారావాహిక ప్రచురణ వరకు ఆయనే శ్రమ తీసుకుని చేస్తున్నారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు!!.

2 comments:
దుర్గా ప్రసాద్ గారూ,
నా చిన్నప్పుడు నేను చూసిన మొట్టమొదటి తెలుగు కార్టూన్ ధారావాహిక. అలా అద్భుతంగా గుర్తుండిపోయింది. అప్పట్లో ఆంధ్ర సచిత్ర వారపత్రిక ముఖచిత్రం వెనుక వచ్చేది. అవన్నీ కట్ చేసుకుని దాచుకున్నాను. చాలా కాలం నా దగ్గర ఉన్నాయి. కాని విజయవాడలో పుస్తకాలు ఉండిపోయి నేను ఉద్యోగరిత్యా దేశం పట్టడంతో, చాలా పుస్తకాలు చెదపురుగులకి ఆహారం అయ్యాయి. అందులో వెంకన్నాస్ కోల్డ్ కలెక్షన్ ఒకటి. చాలా చాలా బాధపడ్డాను వాటిని జాగ్రత్తపరచలేకపోయినందుకు. ఇంత కాలానికి, ఇటీవల నేను కొన్ని భాగాలు మళ్ళి పోగు చెయ్యటం, మీ దగ్గర రెండు భాగాలు దొరకటంతో, ఆ పోయినవన్నీ దొరికినాయి.
ఆ రోజుల్లో వారం-వారం ఆసక్తిగా ఎదురుచూసిన ధారావాహిక, మళ్ళీ నా ద్వారా బ్లాగులోకానికి పరిచయం చెయ్యటానికి మీరిచ్చిన సహకార, ప్రోత్సాహాలకు, కృతజ్ఞతలు.
అప్పటి, మీ బొమ్మల సీరియల్, ఇంతకాలానికి మళ్ళీ ప్రచురించబడటం, అందులో నేను పాలుపంచుకునే అవకాశం రావటం, చాలా థ్రిల్లింగ్ గా ఉన్నది.
మరొక్కసారి ధన్యవాదాలు.
మరొక్కసారి ధన్యవాదాలు, శివగారు!
Post a Comment