Thursday, April 30, 2015

శ్రీశ్రీ 105 జయంతి !

ఇవాళ మహాకవి శ్రీరంగం శ్రీనివాస రావు గారి 105 జయంతి.
ఈ ఫోటో 1981 లో నేను శ్రీశ్రీ గారితో స్వాతి కార్యాలయ ప్రాంగణంలో తీసుకున్నది . అప్పుడు ఒక వారం రోజులు అనుకుంటాను ఆయన శ్రీ వేమూరి బలరామ్ గారి అతిథి గా విజయవాడ లో వున్నారు. ఆఫీసు తర్వాత నేను సాయంత్రం వేళల్లో ఆయన దగ్గర కుర్చునేవాడిని .  ఒక రోజు అమెరికా లోని తమ డిస్నీ ల్యాండ్ సందర్శన గురించి చాలా బాగా చెప్పారు . డిస్నీ సృజనాత్మ శక్తిని ఎంతగానో మెచ్చుకున్నారు .  రెండురోజులు  సోమర్సెట్ మామ్ కథ చెప్పారు .  ఆయన కథ చెప్పే తీరు బ్రహ్మాండం!  సినిమా రంగం  అనుభవం  కాబోలు కళ్ళకు కట్టినట్టు  చెప్పేవారు .  ఒక సారి ఆదివారం అనుకుంటా - శ్రీశ్రీ గారితో పాటు నేను భోజనానికి కూర్చున్నాను  శ్రీ వేమూరి బలరామ్ గారు ఇంటిలో .  శ్రీశ్రీ గారు భోజనం చాలా క్లుప్తం గా వుండేది .  కొద్దిపాటి కూర తో అన్నం, ఆవకాయ ,
లేక ఉడకపెట్టిన గుడ్డు, ఎక్కువగా పెరుగన్నం .  అదీ ఆయన భోజనం .  మాటలాడ కుండా భోజనం ముగించేవారు .  నా కళ్ళకి ఆయన ఒక  విప్లవ కవి గా తోచలేదు .  ఒక తెలుగు పంతులు గారి వలే
కనిపించారు .  ఆయన వ్రాసిన కవిత్వాన్ని చదివే పాత్రలు చొక్కాలు చించుకుంటూ కనిపిస్తారు తప్పితే , ఆయన కాదు .  ఆయనొక నిండు కుండ!  ఆయనతో ఓ నాలుగు రోజుల పాటు  కూర్చునే అవకాశం  రావటం - నా  జీవితంలో ఒక గొప్ప అనుభవం!  ఈ జయంతి  సందర్భంగా ఆయనకు పుష్పాంజలి  !

No comments: