Friday, April 24, 2015

పెద్దబాలశిక్ష - శ్రీ గాజుల సత్యనారాయణ

పెద్ద బాలశిక్ష  రూపకర్త, గ్రంధకర్త,  శ్రీ గాజుల సత్యనారాయణ  యూనివర్సల్ గ్లోబల్ పీస్ , అమెరికా వారి గౌరవ డాక్టరేట్ పొందారు . వారి పుస్తకం  'పెద్ద బాల శిక్ష ' 126 వ  ముద్రణ వెలువడింది . ఇప్పటివరకు 7 లక్షల ప్రతులు అమ్ముడు పోయాయి .  ఇది ఒక గొప్ప శిఖరాన్ని అందుకోవటం లాంటిది . ఇది  ఒక ప్రాంతీయ బాషా  పుస్తకం ఇన్ని ముద్రణల తో , ఇన్ని  ప్రతులు అమ్ముడు పోవటం - భారతీయ బాషల లో  తెలుగు బాషకు దక్కిన అరుదైన గౌరవం .ఈ సందర్భంగా  కృష్ణాజిల్లా రచయితల సంఘం  , ప్రపంచ పుస్తక దినోత్సవ  పండుగ రోజు  సాయంత్రం  - అంటే  23-4-2015 న శ్రీ గాజుల సత్యనారాయణ గారిని అభినందించి సత్కరించింది .  పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు  ఆయనని సత్కరించారు.  ఈ అభినందన సభ,  కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, శ్రీ గుత్తికొండ సుబ్బారావు,  కార్యదర్శి డా . జి .వి . పూర్ణచంద్  ఆధ్వర్యంలో సంబరంగా  జరిగింది .  

            డా . డి . రవి (తంజావూరు  సరస్వతి మహల్ గ్రంధాలయం , తెలుగు పండితులు)  సరస్వతి గ్రంధాలయం యొక్క విశేషాలను చెప్పారు.   ఇది అతి పురాతనమయిన గ్రంధాలయం  అన్నారు . వారు చెప్పిన విశేషాలు విని
వెంటనే తంజావూరు వెళ్లి ఆ తెలుగు గ్రంధాలయా న్ని  సందర్శించి తరించాలనిపించింది  చాలా మందికి . 

            శ్రీ గుత్తికొండ సుబ్బారావు , డా . జి .వి . పూర్ణచంద్ ,  డా .  ఈమని శివనాగి రెడ్డి  ( రాష్ట్ర సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు ),   డా . పాలెపు సుబ్బారావు  (ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంధాలయ మరియు పరిశోధనాలయ సహాయ సంచాలకులు ,  హైదరాబాద్ ),           డా . రావి శారద  (కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్  గ్రంధాలయ  సంఘం),   శ్రీ శిరం రామారావు  (విజయవాడ బుక్ ఫెస్టివల్  సొసైటీ  అధ్యక్షులు) ప్రసంగించారు . 
            
            సభ ముగింపులో   "పుస్తకం " మీద కొందరు తమ కవితలను చదివి వినిపించారు . 


No comments: