Sunday, January 29, 2017

శ్రీ శీలా వీర్రాజు గారు

      శ్రీ శీలా వీర్రాజు గారు ప్రసిద్ధ రచయిత , కవి , చిత్రకారులు .  "మైనా " నవలకు సాహిత్య అకాడెమి పురస్కారం పొందారు . ఆయన కథా శైలి చాలా బాగుంటుంది .  ఎన్నో పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశారు .  వారి రచనలు , చిత్రాలు  గ్రంథాలుగా వచ్చాయి .  ఆయన మృదు స్వభావి . నిజాయితీగల రచయిత . ఆయన పెయింటింగ్స్ కూడా  ఆయన స్వభావాన్ని తెలుపుతాయి .   1972 లో మొదటిసారిగా ఆయనను  హైదరాబాద్ లో కలిసాను .  వారు అప్పుడు రాష్ట్ర సమాచార శాఖలో అనువాదకులుగా  వున్నారు .  వ్యాపకంగా , రచనలు చిత్రాలు  చేసేవారు . 1972  ఆయనను కలసినప్పుడు , నా బొమ్మల కథ  "వెంకన్నా'స్ కోల్డ్ " ఆంధ్ర సచిత్ర వార పత్రికలో సీరియల్ గా వస్తోంది .  అవి చూసి ఆయన నన్ను ఎంతగానో  ప్రోత్సహించారు .  ఆయనను అప్పుడప్పుడు  కలుస్తూ వుండేవాణ్ణి 

       శ్రీ వీర్రాజు గారి చిత్రకళా ప్రదర్శన  విజయవాడ లో 21-1-2017 నుండి మూడు రోజులపాటు జరిగింది .  ఆ సందర్భంగా  ఆయన సతీ సమేతంగా విజయవాడ వచ్చేరు .  ఆయన శ్రీమతి సుభద్రాదేవి గారు కూడా  సంపుటాలు వెలువరించిన కవయిత్రి , రచయిత్రి . 

          ఈ దిగువన ఆయనతో తీసుకున్న ఫోటో , చిత్ర కళా ప్రదర్శనలో ని  కొన్ని చిత్రాల  ఫోటోలు  చూడగలరు .  





No comments: