Friday, April 28, 2017

బాహుబలి సినిమా విడుదల గురించి ప్రపంచమంతా ప్రచారం జోరుగా మొదలయింది .  దానితో ప్రేక్షకుల వెర్రి మరింత పెరిగింది .  ఉదయం నాలుగు గంటలకే  సినిమా హాళ్ల దగ్గర క్యూ లో నిలబడడం చూస్తోంటే వెర్రి బాగా ముదిరింది అనిపిస్తోంది .  ఆ మధ్య  ఎటిఎం క్యూ లో నిలబడ టానికి  , ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు .  ఇప్పుడు తెల్లారక మునుపే , కిలోమీటర్ మించి వున్న క్యూ లో  వెర్రి సంతోషం తో  సినిమా హాళ్ల దగ్గర వుంటున్నారు .  వీరంతా బాగా చదువుకున్న వాళ్ళే సుమీ .  

కొందరు ఆన్ లైన్ టికెట్స్ కొంటున్నారు .  అవి బోగస్ అంటున్నారు కొందరు .  నవీన  సినిమా హాళ్లలో ,  ఎక్కువ డబ్బులు వసూళ్లు చేస్తూ, పాప్ కార్న్ లేక ఓ కూల్ డ్రింక్ టోకెన్ లు ఇస్తున్నారట .  చిన్న సినిమా థియేటర్ దగ్గర టికెట్ లు బ్లాక్ లో అమ్మడం మామూలు అయి పోయింది .  ఇలా ఎవరికీ వారు వెర్రి ప్రేక్షకులను దోచుకోవడం మొదలు పెట్టారు . సామాన్యునికి  సినిమా నాలుగు రోజులు ఆగి చూస్తే  కొంపలేమీ మునిగిపోవు . కానీ -  మొదటి రోజే , బాగా  కలెక్షన్స్ సంపాదించాలి,  లేకపోతే - నెగటివ్ టాక్ వచ్చిందంటే , కొంపలు తప్ప క మునిగిపోతాయి , అని నిర్మాతల భయం కావొచ్చు .  
లాభాలు రావాలని  నిర్మాతలకు శుభాకాంక్షలు .  చాలా కష్టాలు పడి , మొదటిరోజున సినిమా చూసిన  వెర్రి ప్రేక్షకులకు అభినందనలు !

No comments: