Thursday, August 23, 2018

స్వాతి సపరివార పత్రిక లో రంగుల పేజీలు ఎక్కువ చేసిన రోజుల్లో, కార్టూన్లు కూడా రంగుల్లో వేయటం మొదలుపెట్టారు .   అప్పటినుంచి ఇప్పటివరకు బొమ్మలు రంగుల్లోనే వేస్తున్నాను

Friday, December 22, 2017

ప్రపంచ తెలుగు మహాసభలు

ప్రపంచ తెలుగు మహాసభలు , తెలంగాణ ప్రభుత్వం , హైదరాబాద్ లో  2017, డిసెంబర్ 15-19 మధ్య నిర్వహించింది .  ఈ సభలకు కార్టూన్ ప్రదర్శన నిర్వహించడం కోసం,  కార్టూనిస్టుల నుండి , కార్టూన్లను కోరారు .  ఎంపిక అయినవాటిని ప్రదర్శనలో వుంచుతామని చెప్పారు.  ఆ సందర్భంగా , నేను పై కార్టూన్ పంపించాను .  ప్రదర్శనలో ఉంచారు.  

Saturday, October 14, 2017

                               కచ్చి గ్రంధం !

Friday, October 13, 2017

    ఈ బొమ్మకి ఆంధ్ర ప్రభ వారి నుంచి  రూ . 50/-  లు            పారితోషికంగా  చెక్కు వచ్చింది  - అదీ 1967 లో !

Friday, April 28, 2017

బాహుబలి సినిమా విడుదల గురించి ప్రపంచమంతా ప్రచారం జోరుగా మొదలయింది .  దానితో ప్రేక్షకుల వెర్రి మరింత పెరిగింది .  ఉదయం నాలుగు గంటలకే  సినిమా హాళ్ల దగ్గర క్యూ లో నిలబడడం చూస్తోంటే వెర్రి బాగా ముదిరింది అనిపిస్తోంది .  ఆ మధ్య  ఎటిఎం క్యూ లో నిలబడ టానికి  , ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు .  ఇప్పుడు తెల్లారక మునుపే , కిలోమీటర్ మించి వున్న క్యూ లో  వెర్రి సంతోషం తో  సినిమా హాళ్ల దగ్గర వుంటున్నారు .  వీరంతా బాగా చదువుకున్న వాళ్ళే సుమీ .  

కొందరు ఆన్ లైన్ టికెట్స్ కొంటున్నారు .  అవి బోగస్ అంటున్నారు కొందరు .  నవీన  సినిమా హాళ్లలో ,  ఎక్కువ డబ్బులు వసూళ్లు చేస్తూ, పాప్ కార్న్ లేక ఓ కూల్ డ్రింక్ టోకెన్ లు ఇస్తున్నారట .  చిన్న సినిమా థియేటర్ దగ్గర టికెట్ లు బ్లాక్ లో అమ్మడం మామూలు అయి పోయింది .  ఇలా ఎవరికీ వారు వెర్రి ప్రేక్షకులను దోచుకోవడం మొదలు పెట్టారు . సామాన్యునికి  సినిమా నాలుగు రోజులు ఆగి చూస్తే  కొంపలేమీ మునిగిపోవు . కానీ -  మొదటి రోజే , బాగా  కలెక్షన్స్ సంపాదించాలి,  లేకపోతే - నెగటివ్ టాక్ వచ్చిందంటే , కొంపలు తప్ప క మునిగిపోతాయి , అని నిర్మాతల భయం కావొచ్చు .  
లాభాలు రావాలని  నిర్మాతలకు శుభాకాంక్షలు .  చాలా కష్టాలు పడి , మొదటిరోజున సినిమా చూసిన  వెర్రి ప్రేక్షకులకు అభినందనలు !

Sunday, January 29, 2017

శ్రీ శీలా వీర్రాజు గారు

      శ్రీ శీలా వీర్రాజు గారు ప్రసిద్ధ రచయిత , కవి , చిత్రకారులు .  "మైనా " నవలకు సాహిత్య అకాడెమి పురస్కారం పొందారు . ఆయన కథా శైలి చాలా బాగుంటుంది .  ఎన్నో పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశారు .  వారి రచనలు , చిత్రాలు  గ్రంథాలుగా వచ్చాయి .  ఆయన మృదు స్వభావి . నిజాయితీగల రచయిత . ఆయన పెయింటింగ్స్ కూడా  ఆయన స్వభావాన్ని తెలుపుతాయి .   1972 లో మొదటిసారిగా ఆయనను  హైదరాబాద్ లో కలిసాను .  వారు అప్పుడు రాష్ట్ర సమాచార శాఖలో అనువాదకులుగా  వున్నారు .  వ్యాపకంగా , రచనలు చిత్రాలు  చేసేవారు . 1972  ఆయనను కలసినప్పుడు , నా బొమ్మల కథ  "వెంకన్నా'స్ కోల్డ్ " ఆంధ్ర సచిత్ర వార పత్రికలో సీరియల్ గా వస్తోంది .  అవి చూసి ఆయన నన్ను ఎంతగానో  ప్రోత్సహించారు .  ఆయనను అప్పుడప్పుడు  కలుస్తూ వుండేవాణ్ణి 

       శ్రీ వీర్రాజు గారి చిత్రకళా ప్రదర్శన  విజయవాడ లో 21-1-2017 నుండి మూడు రోజులపాటు జరిగింది .  ఆ సందర్భంగా  ఆయన సతీ సమేతంగా విజయవాడ వచ్చేరు .  ఆయన శ్రీమతి సుభద్రాదేవి గారు కూడా  సంపుటాలు వెలువరించిన కవయిత్రి , రచయిత్రి . 

          ఈ దిగువన ఆయనతో తీసుకున్న ఫోటో , చిత్ర కళా ప్రదర్శనలో ని  కొన్ని చిత్రాల  ఫోటోలు  చూడగలరు .  





Saturday, November 26, 2016

నల్ల ధనం !


  భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోది గారు తే . 8-11-2016 న సాయంత్రం  రూ . 500/- మరియు  రూ . 1000/- నోట్లు ఆ రోజు అర్ధ రాత్రి తర్వాత చెల్లుబడి కావని  మీడియా ద్వారా ప్రకటించారు .  ప్రజలు తమ దగ్గర వున్న నోట్లు  బ్యాంకులు , పోస్ట్ ఆఫీస్ ల  ద్వారా  డిసెంబర్  ,2016 లోగా మార్చుకోవాలని చెప్పారు .  ఈ విషయంలో కొన్ని ఆంక్షలు విధించారు .   ఇక అంతే - జనం  గందర గోళానికి గురి అయ్యారు .  చిల్లర సమస్య ఎక్కువయింది .  బ్యాంకుల్లోను , ఎటిఎం  లు  జనం బారులు తీరారు .  వారం పదిరోజులు అయినా , క్యూ బారులు తగ్గలేదని  టీవీ చానెళ్లు రొప్పుతూ రోజూ  ప్రచారం చేస్తూనే వున్నాయి . మొదట  క్యూ లో నిలబడి ఒకరు ప్రాణాలు విడిచారని  వార్త వచ్చింది . ఇక రోజు రోజుకి   ఆ సంఖ్య పెరగ సాగింది .  ఇప్పటి  (26-11-2016 )వరకు  70 మంది  క్యూ లో వుంది మరణించారని  మీడియా ద్వారా తెలుస్తోంది .  ఇలా పోయినవారి విషయం లో విపక్షాలవారు  రూ . 20 లక్షల  పరిహారం కూడా డిమాండ్ చేశారు .   ఇది ఇలా సాగుతోనేవుంది !... 

Thursday, November 24, 2016

శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు

     కర్ణాటక సంగీత ప్రముఖ విద్వాంసులు కీ. శే . పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి శత జయంతి ఉత్సవాలు విజయవాడలో జరపటం కోసం కొందరి సభ్యులతో   ఒక కమిటీ ఏర్పడింది .  దానికి పెద్ద  (చైర్మన్) గా                  డా. మంగళంపల్లి   బాలమురళీకృష్ణ గారు వున్నారు .  వారితో పాటు శ్రీ అన్నవరపు రామస్వామి గారు కూడా వున్నారు .  వీరిద్దరూ , పంతులుగారి శిష్యులు .  ఉత్సవాలు ఘనం గా జరపటం  కోసం  చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పన కు ఒక సమావేశం జరిగింది .  శ్రీ పారుపల్లి శ్రీరామచంద్ర మూర్తి  , వారిద్దరి  అండదండలతో , సూచనలతో  ఆ సమావేశం లో  ఉత్సవ కార్యక్రమాల రూప కల్పన  తయారు చేశారు . సభ్యులు  తలా ఒక పని చేపట్టి , ఉత్సవాలు ఘనం గా జరిపించారు .  

    ఇది 30 ఏళ్ళ నాటి మాట .    ఆనాటి సమావేశం లో నేనూ  ఒక సభ్యుని పాల్గొన్నాను .  ఆ సమావేశంలో నేను కనిపెట్టినదేవిటంటే , డా.  బాలమురళీకృష్ణ గారు  విశ్వ విఖ్యాత కర్ణాటక  సంగీత విద్వాంసులే కాదు , గొప్ప హాస్య ప్రియులు , సంభాషణా చతురులు కూడా !
     ఆయన మంగళవారం సాయంత్రం  (15-11-2016) న చెన్నై లో  86 ఏట కన్ను మూసారు . 
     వారికి శ్రద్ధాంజలి !
     

Friday, November 11, 2016

పెళ్ళాం చెప్తే వినాలి !

 భారత దేశంలో  రూ . 500/-  మరియు  రూ . 1000/- నోట్లు  8-11-2016 అర్ధరాత్రి నుంచి చెల్లవని, వాటి స్థానే కొత్త నోట్లు బ్యాంకుల ద్వారా  మార్చు కోవాలని , ప్రభుత్వం ప్రకటించింది . దీనిని   దేశం లో నల్లధనాన్ని తొలగించటానికి తీసుకున్న  చర్యగా చెప్పారు .  

Thursday, November 10, 2016

చిత్రకారులు !

ఆధునిక చిత్రకళా ప్రపంచంలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన డాక్టర్ ఎస్. వి. రామారావు గారు  'ఆంధ్ర పత్రిక - సాహిత్య సేవ'  సదస్సులో ప్రసంగించారు .  ఈ సభ  తే. 6-11-2016 న . విజయవాడ లో  ఉ .  గం. 10  నుండి సాయంత్రం వరకు జరిగింది.  శ్రీ రామారావు గారు, ఆంధ్రపత్రిక తో  మరియు  శివలెంక శంభుప్రసాద్  గారితో  తమ అనుభవాలను , అనుబంధాలను  తమ ప్రసంగం లో  గుర్తు చేసుకున్నారు .  ప్రసంగం తర్వాత ఇది  నేను వారితో దిగిన ఫోటో !  

నల్లధనం !

            ఆంధ్ర పత్రిక శివలెంక రాధాకృష్ణ గారు , విదేశీ ఆంగ్ల పత్రికలు  నాకు ఇచ్చి వాటిని చదివి వ్యాసాలు  వ్రాయమని చెప్పేవారు .  అలా వ్రాసిందే ఈ వ్యాసం  (1984). 

Monday, September 26, 2016

వానల తర్వాత ...


వాన కాదు ..వానకాదు ...వరదా రాజా....!

   రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం పదిరోజులుగా  ఎడతెరిపిలేని వర్షాల కారణంగా , అన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి .  వాగులు , నదులు పొంగిపొర్లడంతో ,  రోడ్లు, రైలు మార్గాలు  దెబ్బతిన్నాయి .  రాకపోకలు నిలిచిపోయాయి .  వాహనాలు  నీట మునిగాయి .  బస్సులు, లారీలు  నీటి మధ్య  నిలిచిపోయాయి .  అందులోని ప్రయాణికులను రక్షించగలిగారు .  విజయవాడ వద్ద , ప్రకాశం బ్యారేజి  కృష్ణవేణి శక్తిని తట్టుకోలేక , గేట్లు ఎత్తివేసింది . బ్యారేజీకి ఇరువైపులా  కృష్ణవేణి సముద్రాన్ని తలపింపజేచింది .  విజయవాడ ప్రజలకి , కృష్ణవేణి నిండుగా  ప్రవహించడం కన్నులపండువ చేసింది . శ్రీశైలం,  నాగార్జున సాగర్  లు కూడా  , పూర్తిగా నిండిపోయి , నీటిని నిరంతరం బయటకి వదలాల్సి వచ్చింది   జలసంపద పెరిగింది .  కొంత ఆస్తి , పంట నష్టం కూడా జరిగింది

    తెలంగాణా లో కూడా అన్ని నీటి ప్రాజెక్టులు  పూర్తిగా నిండిపోయాయి . జంట నగరాలైయిన , హైదరాబాద్  - సికింద్రాబాద్ జలమయమయ్యాయి .  చాలా చోట్ల  రోడ్లు నడుం లోతు  నీటిలో వున్నాయి .  వాహనాలు నీటిలో ఆగిపోయాయి .  టీవీ చానెల్స్ లో చూస్తే  , పరిస్థి తి  దారుణంగా  కనిపించింది .  చెరువుల్లో కట్టిన వందలాది అపార్టుమెంటు లు ,  ఒక్కొక్కటీ  ద్వీపంలా కనిపించాయి .  హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయి ,  జనాన్ని భయపెట్టింది .అపార్టుమెంటు  వాసులు  రాకపోకలకు మార్గం లేక విలవిలా లాడిపోయారు .  నీరు పోయే మార్గం లేక , గ్రౌండ్ ఫ్లోర్ లు నిండిపోయాయి .  నిత్యావసరాల కోసం   చాలా ఇబ్బంది పడ్డారు .  రోడ్లు బాగా దెబ్బతిన్నాయి .   ఎడతెరిపిలేని వర్షాలవల్ల , నిస్సహాకులకి  సాయం అందజేయటం కూడా కష్టమయిపోయింది .  ఇల్లాంటి వానలు గత 20-30 సంవత్సరాల్లో  చూడలేదని కొంతమంది అంటున్నారు .
    చివరకు నిన్న (25-9-2016) సూర్యదేవుడు కనిపించాడు  .   మునిగిన కాలనీ ల నుండి , నీటిని  యంత్రాల ద్వారా  బయటకు తోడిపోయటం మొదలు పెట్టారు .  యధాస్థితికి , మరో వారం పట్టవచ్చు
    

Monday, September 12, 2016

రాజకీయాలు !


                                     ఆంధ్ర పత్రిక   1986-87 కార్టూనులు 

Friday, June 17, 2016

ఆలోచించండి !

(కాపు జాతి రిజర్వేషన్ కోసం,  ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష పూనగా ,  ఆయన్ని పోలీస్ లు వైద్య పరీక్షల నిమిత్తం రాజమహేంద్రవరం  ఆసుపత్రికి  వారం రోజుల క్రితం తరలించారు . ఆయన పరిస్థితి  నిలకడగా వున్నదని టీవీ వార్తలు తెలుపుతున్నాయి )

Monday, June 13, 2016

చదువులు !




                 
                    ( 30 ఏళ్ల  క్రితం  విపుల/చతుర  మాసపత్రిక లో  ప్రచురణ)