Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts

Friday, October 13, 2017

    ఈ బొమ్మకి ఆంధ్ర ప్రభ వారి నుంచి  రూ . 50/-  లు            పారితోషికంగా  చెక్కు వచ్చింది  - అదీ 1967 లో !

Sunday, January 29, 2017

శ్రీ శీలా వీర్రాజు గారు

      శ్రీ శీలా వీర్రాజు గారు ప్రసిద్ధ రచయిత , కవి , చిత్రకారులు .  "మైనా " నవలకు సాహిత్య అకాడెమి పురస్కారం పొందారు . ఆయన కథా శైలి చాలా బాగుంటుంది .  ఎన్నో పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశారు .  వారి రచనలు , చిత్రాలు  గ్రంథాలుగా వచ్చాయి .  ఆయన మృదు స్వభావి . నిజాయితీగల రచయిత . ఆయన పెయింటింగ్స్ కూడా  ఆయన స్వభావాన్ని తెలుపుతాయి .   1972 లో మొదటిసారిగా ఆయనను  హైదరాబాద్ లో కలిసాను .  వారు అప్పుడు రాష్ట్ర సమాచార శాఖలో అనువాదకులుగా  వున్నారు .  వ్యాపకంగా , రచనలు చిత్రాలు  చేసేవారు . 1972  ఆయనను కలసినప్పుడు , నా బొమ్మల కథ  "వెంకన్నా'స్ కోల్డ్ " ఆంధ్ర సచిత్ర వార పత్రికలో సీరియల్ గా వస్తోంది .  అవి చూసి ఆయన నన్ను ఎంతగానో  ప్రోత్సహించారు .  ఆయనను అప్పుడప్పుడు  కలుస్తూ వుండేవాణ్ణి 

       శ్రీ వీర్రాజు గారి చిత్రకళా ప్రదర్శన  విజయవాడ లో 21-1-2017 నుండి మూడు రోజులపాటు జరిగింది .  ఆ సందర్భంగా  ఆయన సతీ సమేతంగా విజయవాడ వచ్చేరు .  ఆయన శ్రీమతి సుభద్రాదేవి గారు కూడా  సంపుటాలు వెలువరించిన కవయిత్రి , రచయిత్రి . 

          ఈ దిగువన ఆయనతో తీసుకున్న ఫోటో , చిత్ర కళా ప్రదర్శనలో ని  కొన్ని చిత్రాల  ఫోటోలు  చూడగలరు .  





Thursday, November 10, 2016

చిత్రకారులు !

ఆధునిక చిత్రకళా ప్రపంచంలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన డాక్టర్ ఎస్. వి. రామారావు గారు  'ఆంధ్ర పత్రిక - సాహిత్య సేవ'  సదస్సులో ప్రసంగించారు .  ఈ సభ  తే. 6-11-2016 న . విజయవాడ లో  ఉ .  గం. 10  నుండి సాయంత్రం వరకు జరిగింది.  శ్రీ రామారావు గారు, ఆంధ్రపత్రిక తో  మరియు  శివలెంక శంభుప్రసాద్  గారితో  తమ అనుభవాలను , అనుబంధాలను  తమ ప్రసంగం లో  గుర్తు చేసుకున్నారు .  ప్రసంగం తర్వాత ఇది  నేను వారితో దిగిన ఫోటో !  

Friday, February 12, 2016

50 ఏళ్ళ పరిచయాలు .

పిళ్లా సుబ్బారావు గారు 1962 నుంచి నాకు పరిచయం  .  ఆయన అప్పటికే 'ఆంధ్ర ప్రభ' దినపత్రికలో  "చిత్ర జగత్" శీర్షికతో పాకెట్ కార్టూన్లు వేస్తూ ఉండేవారు .  అప్పట్లో ఆ కార్టూన్లు గొప్ప సంచలనం .  దానికి ముందే , 'పారిపోయిన బఠానీ ' పిల్లల నవల వ్రాసి  రచయితగా కూడా గుర్తింపు పొందేరు .  వారు సినిమా పబ్లిసిటి రంగంలో కుడా వున్నారు .   'గీతా సుబ్బారావు' గా అందులోనే స్థిరపడి పోయారు .  నేను 1962 లో , సినిమా ప్రకటనలు , పోస్టర్ డిజైన్ లు కొన్ని సినిమాలకు వేసాను .  అప్పుడే ఆయనతో పరిచయం .

      1962 లో "బాపు ఆర్టు ఎక్సిబిషన్ " విజయవాడ లో జరిగింది .  దాని నిర్వహణ కార్యక్రమాలు సుబ్బారావు గారే  చూసారు --శ్రీ కాట్రగడ్డ నర్సయ్య అండదండలతో .  అందులో నేను కూడా పాలుపంచుకున్నాను ( వయసు 16 ఏళ్ళు ). మరునాటికి  ప్రదర్శనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న ఆ రాత్రి బాపు గారు  విచ్చేసి మమ్మల్ని అందరిని
అభినందించారు .కరచాలన చేసారు .   బాపు గారు వేసిన వేలాది బొమ్మలు  ప్రదర్శన  కోసం నా చేతులతో అలంకరిస్తుంటే , నేను కూడా బొమ్మలు , కార్టూన్ లు  వేయాలనిపించింది .  నాకు గురువు లాంటి మిత్రుడు , కీ. శే . క్యానం భగవాన్ దాస్ కూడా , సినిమా పబ్లిసిటీ మానేసి  కార్టూన్ లు, బొమ్మలు సాధన చెయ్యమని ప్రోత్సహించాడు . ఆ విధంగా బాపు గారి బొమ్మలు , నా జీవిత గమనాన్ని మార్చివేసింది .

     సుబ్బారావు గారు, చలన చిత్ర ప్రచార రంగం లో వుండిపోయారు .  నేను హైదరాబాద్ లో వున్నప్పుడు , అప్పుడప్పుడు కలుస్తూ వుండేవాళ్ళం .  చాలా ఏళ్ళ తర్వాత,  పోయిన సంవత్సరం విజయవాడలో 3 వ 'ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ' జరిగినప్పుడు  అక్కడ కనిపించారు .  ఫోటో దిగాము .
   
     సుబ్బారావు గారు! మీకు శుభాకాంక్షలు

Wednesday, August 5, 2015

కీ. శే . శివలెంక రాధాకృష్ణ గారు !

కీ. శే . శివలెంక రాధాకృష్ణ గారు (ఆంధ్ర పత్రిక ) గతించి పదేళ్ళు దాటినయి . ఈ వ్యాసం పదేళ్ళ క్రితం స్వాతి వీక్లీ లో వ్రాసాను .  ఆయన్ను గుర్తు చేసుకుంటూ దానిని మళ్ళీ ఈ బ్లాగ్ లో ప్రచురిస్తున్నాను . 
.

Thursday, April 30, 2015

శ్రీశ్రీ 105 జయంతి !

ఇవాళ మహాకవి శ్రీరంగం శ్రీనివాస రావు గారి 105 జయంతి.
ఈ ఫోటో 1981 లో నేను శ్రీశ్రీ గారితో స్వాతి కార్యాలయ ప్రాంగణంలో తీసుకున్నది . అప్పుడు ఒక వారం రోజులు అనుకుంటాను ఆయన శ్రీ వేమూరి బలరామ్ గారి అతిథి గా విజయవాడ లో వున్నారు. ఆఫీసు తర్వాత నేను సాయంత్రం వేళల్లో ఆయన దగ్గర కుర్చునేవాడిని .  ఒక రోజు అమెరికా లోని తమ డిస్నీ ల్యాండ్ సందర్శన గురించి చాలా బాగా చెప్పారు . డిస్నీ సృజనాత్మ శక్తిని ఎంతగానో మెచ్చుకున్నారు .  రెండురోజులు  సోమర్సెట్ మామ్ కథ చెప్పారు .  ఆయన కథ చెప్పే తీరు బ్రహ్మాండం!  సినిమా రంగం  అనుభవం  కాబోలు కళ్ళకు కట్టినట్టు  చెప్పేవారు .  ఒక సారి ఆదివారం అనుకుంటా - శ్రీశ్రీ గారితో పాటు నేను భోజనానికి కూర్చున్నాను  శ్రీ వేమూరి బలరామ్ గారు ఇంటిలో .  శ్రీశ్రీ గారు భోజనం చాలా క్లుప్తం గా వుండేది .  కొద్దిపాటి కూర తో అన్నం, ఆవకాయ ,
లేక ఉడకపెట్టిన గుడ్డు, ఎక్కువగా పెరుగన్నం .  అదీ ఆయన భోజనం .  మాటలాడ కుండా భోజనం ముగించేవారు .  నా కళ్ళకి ఆయన ఒక  విప్లవ కవి గా తోచలేదు .  ఒక తెలుగు పంతులు గారి వలే
కనిపించారు .  ఆయన వ్రాసిన కవిత్వాన్ని చదివే పాత్రలు చొక్కాలు చించుకుంటూ కనిపిస్తారు తప్పితే , ఆయన కాదు .  ఆయనొక నిండు కుండ!  ఆయనతో ఓ నాలుగు రోజుల పాటు  కూర్చునే అవకాశం  రావటం - నా  జీవితంలో ఒక గొప్ప అనుభవం!  ఈ జయంతి  సందర్భంగా ఆయనకు పుష్పాంజలి  !

Sunday, February 1, 2015

శ్రీ బాలాంత్రపు రజనీకాంతారావు గారు

         వంద వసంతాలు చూసిన   వారు, ఎందఱో గాయక గాయకీ మణులకు మార్గదర్శకులు , సంగీత దర్శకులు , ఎందరికో గురుదేవులు , ఎన్నో పాటలు వ్రాసి , స్వరపరచి  అలనాటి తెలుగు నేలను అబ్బురపరచిన గాయకులు 
శ్రీ బాలాంత్రపు రజనీకాంతారావు గారు!  31-1-2015 న వారు తమ నూరవ పుట్టినరోజు  తమ కుటుంబ సభ్యులు, బంధు  మిత్రులు , సంగీత ప్రముఖులు , అభిమానుల  మధ్య వేడుకగా  జరుపుకొన్నారు. 
         ఆ రోజు సాయంత్రం  వారికి  గొప్పగా సన్మాన   జరిగింది . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  శాసన సభ ఉపాధ్యక్షులు 
శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు . 

          ఆ రోజు ఉదయం మా ఇంటికి సమీపంలో వున్న వారి నివాసానికి  వెళ్ళాను . వారికోసం హాల్లో వేచివున్నాను. పది నిముషాల తర్వాత పెద్ద స్వరం వినిపించింది . వెనక్కి తిరిగి లేచి నిలబడ్డాను .  శ్రీ రజనీకాంతారావు గారు పాడుతూ వస్తున్నారు. ఆయన్ని వారి కుమారులు శ్రీ హేమచంద్ర గారు మెల్లగా నడిపించి 
తీసుకొని వస్తున్నారు. ఆ సమయం లో   వారి గాత్రం అనుకోకుండా వినడం గొప్ప అదృష్టం అనిపించింది . వారికి  వయసు మళ్ళినా , వారి స్వరానికి ఏమాత్రం బలం తగ్గలేదు !  వారిని కుర్చీలో  కూర్చోబెట్టారు .  నేను వారికి పాదాభివందనం చేసి,  నా కార్టూన్ ల పుస్తకం "ఇ  వేమన పద్యాలు " చేతికి అందించాను . వారు స్వీకరించారు . వారి కుమారులు, శ్రీ హేమచంద్ర గారు నన్ను వారికి పరిచయం చేసారు . వారి అనుమతితో ఫోటోలో తీశాను . వారితో ఫోటోలు దిగాను . అదే సమయంలో  శ్రీ వి.ఎ. కె. రంగారావు గారు విచ్చేశారు .  ఆయన రావటంతోనే  వారికి .... ప్రణామాలు చేసి పలకరించారు . ఆయన రాక సందడి పెంచింది . ఆ ఇద్దరినీ కలిపి ఫోటో లు తీశాను . 
నా   జీవితం లో ఇదొక మరపురాని రోజు . 

        తెలుగు సినిమా రంగం ప్రారంభ దశలో వున్న కొందరి ప్రముఖులలో  శ్రీ బాలాంత్రపు రజనీకాంతారావు గారు ఒకరు. ఎన్నో సినిమా లకు   పాటలు  వ్రాసారు ,  స్వరకల్పన చేసారు . పాటలు   పాడారు .ఆనాటి  రేడియో శ్రోతలకు  వీరి పేరు తెలియని వారు లేరు . 
         మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  శ్రీ బాలాంత్రపు రజనీకాంతారావు గారికి తగిన గుర్తింపు దక్కేలా చేయగలదని ఆశిద్దాం!

సామాన్యుడు


Saturday, December 13, 2014

మతం !

స్వామీ , చక్కగా చెప్పారు !
   ఈ సందర్భంగా నేను ఎప్పుడో  34 ఏళ్ళ క్రితం  ఆంధ్రపత్రిక  దినపత్రిక  లో వ్రాసిన రెండు వరుసల కవిత  గుర్తుకు వచ్చింది.   అది ... 
       "మతం మంచిది ఎదురుమతం కానంతవరకు 
         కులం మంచిది    వ్యాకులం లేనంతవరకు "
                                                     ---బాబు 
  

Monday, September 1, 2014

బాపు--రమణ ఇప్పుడు --బాపు--రమణ .


బాపు నాకు గురుదేవులు . ఇప్పుడు దేవుడయ్యారు .  31-8-2014 సాయంత్రం ఆయన ఇక లేరు అన్న వార్త మా పెద్ద అబ్బాయి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే లేచి టీవీ పెట్టాను . అన్ని ఛానెల్స్ ఆయన మరణవార్త ప్రసారం  చేస్తున్నాయి .

     నా కార్టూన్ ల పుస్తకం "ఇవే మన పద్యాలు"  పోయిన ఏడాది పంపించాను .  అది అందిన మరుసటి రోజే నాకు ఫోన్ చేసి పలకరించారు . పుస్తకం చాలా బాగుందని మెచ్చుకున్నారు. అది ఆయన గొప్ప మనసు. "సార్ , స్వయంగా వచ్చి పుస్తకం మీకు ఇద్దామను కున్నాను . కాని నా ప్రయాణ కార్యక్రమం ఆలస్యం అవుతోందని , కొరియర్ లో పంపేను .  మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను " అన్నాను . తప్పకుండ రండి అన్నారు.
ఆయనలా ఫోన్ చేస్తారనుకోలేదు . ఉత్తరం రాస్తారనుకున్నాను. అందుకే సంతోషం తో ఎక్కువ మాట్లాడలేక పొయాను.  తర్వాత కొన్ని రోజులకి ఆయనకి  భార్యా వియోగం కలిగింది . వెళ్లి పలకరించాలని అనుకున్నాను - కాని వీలులేక పోయింది  నా సామాన్య సంసార బాధ్యతలతో .

    మొన్న ఉగాది ఉదయం ఆయనకు ఫోన్ చేశాను శుభాకాంక్షలు చెబుదామని .ఆయన ఫోన్ ఎత్తి "బాబు ... మీతో మళ్ళీ మాట్లాడతాను " అని ఫోన్ పెట్టేశారు . అదే నాతో ఆయన ఆఖరి మాట . తర్వాత మిత్రులు  జయదేవ్ కి ఫోన్ చేసాను - బాపు గారిని ఒక సారి చూడాలని .  ఆయన ఆరోగ్యం సరిగా ఉండటం లేదు , సమయం చూసి చెప్తాను, అప్పుడు వద్దువు గాని అనడంతో , వేచి చూస్తూ వున్నాను.  ఈ వినాయకచవితి పండగ రోజులు అయినాక , ఆయన్ని తప్పకుండ చూసి రావాలనుకున్నాను. కనీసం ఆయన ఇంట్లో దూరంగా నుండి అయినా చూసి రావలనుకున్నాను.  అలా అనుకునే లోపే , ఆయన అందరిని వీడిపోయ్యారు .
 
   ఆయన గురించి ఎన్నో చెప్పాలనివుంది .  నేను కొంచెం కోలుకున్నాక చెప్తాను.

   ఈ పై ఫోటో  స్వాతి బలరామ్ గారు బాపు గారికి (1979?) విజయవాడ లో సన్మానం చేశారు .  అప్పడు బాపు గారితో నేను ...



  

Saturday, June 22, 2013

మహిమాలయాలు !

ఇరవై ఏళ్ళ క్రితం స్వామి రామానంద , మాకు  శ్రీ GVRS వర ప్రసాద్ గారి కుటుంబానికి  హిమాచల్ లోని  ముఖ్య పుణ్యక్షేత్రాలని  చూపించారు . వారి ఆశ్రమం  అక్కడే వుండేది . 

        వారు  అంటువుండేవారు  "ఇవి  హిమాలయాలు కావు,  మహిమాలయాలు!" 
       కానీ యిప్పుడు -- కేదారనాథ్ లోనూ ఇతర ప్రాంతాలలోనూ 

       గంగ శివతాండవం చేశాక --  అవి ప్రళయ నిలయాలు అనిపిస్తోంది . 

       ఇలా మరెన్నటికీ కాకూడదని విలవిలలాడుతూ  ఆ హిమాలయాలనే వేడుకుంటున్నాను . 

Friday, January 13, 2012

కొత్తరకం ముఖచిత్రం!

ఇదేమిటో  తెలుసా? ఒక ముఖ చిత్రం. అయితే, ఇదేదో పత్రిక ముఖచిత్రం అనుకుంటే పొరపాటు పడ్డారన్నమాటే. లోపలి పేజి లో వున్న మరొక బొమ్మ ఈ క్రింద వుంది. అది చూసి చెప్పవచ్చునేమో ప్రయత్నించండి. . 
.
        చెప్పలేక పోతున్నారా?  ముచ్చటగా మూడో బొమ్మ చూడండి.  కొంచెం తెలిసినట్టు అనిపిస్తోంది. కాని చెప్పలేరు.
ఎందుచేతనంటే  'అమృతాంజన్' సంస్థవారు విడుదల చేసిన 2012  డైరి ముఖచిత్రం అది.  మా అబ్బాయి పంపిన ఈ డైరి  చూడగానే  ముచ్చటపడి బ్లాగ్ లో అందరికి చూపించాలనిపించిoది . డైరి అనిగాని , సంస్థ పేరుగానీ ముఖచిత్రం మీద లేకుండా  చాలా ఉత్సుకతను కలిగిస్తున్నది.ఇలా కొత్తదనంతో నిండిన  డైరిని  చూసి వారి అభిరుచిని  ఎంతైనా మెచ్చుకోవాలని పిస్తుంది.   లోపల పేజి లలో ఇల్లాంటి కార్టూన్ లు వారి ఉత్పాదనలు ఎన్నో వున్నాయి.    వారి వెబ్ సైట్ చూస్తే తెలుస్తాయి:  www.amrutanjan.com


      ఆంధ్ర పత్రిక శివలెంక రాధాకృష్ణ గారు 1975  నుండి నాకు అమృతాంజన్  డైరి ఇచ్చేవారు. ఆయన తర్వాతకూడా ఆ సంస్థ  వారి డైరిలు  నేను పొందగలుగు తున్నాను.  ప్రతి సంవత్సరం  వారి డైరి ప్రత్యేకంగా వుంటుంది. ఈసారి డైరి కార్టూన్ లతో చూడగానే  వెంటనే బ్లాగ్ లో  వ్రాయాలనిపించింది. .


    am     .