Showing posts with label భాష. Show all posts
Showing posts with label భాష. Show all posts
Thursday, August 27, 2015
Friday, April 24, 2015
పెద్దబాలశిక్ష - శ్రీ గాజుల సత్యనారాయణ
పెద్ద బాలశిక్ష రూపకర్త, గ్రంధకర్త, శ్రీ గాజుల సత్యనారాయణ యూనివర్సల్ గ్లోబల్ పీస్ , అమెరికా వారి గౌరవ డాక్టరేట్ పొందారు . వారి పుస్తకం 'పెద్ద బాల శిక్ష ' 126 వ ముద్రణ వెలువడింది . ఇప్పటివరకు 7 లక్షల ప్రతులు అమ్ముడు పోయాయి . ఇది ఒక గొప్ప శిఖరాన్ని అందుకోవటం లాంటిది . ఇది ఒక ప్రాంతీయ బాషా పుస్తకం ఇన్ని ముద్రణల తో , ఇన్ని ప్రతులు అమ్ముడు పోవటం - భారతీయ బాషల లో తెలుగు బాషకు దక్కిన అరుదైన గౌరవం .ఈ సందర్భంగా కృష్ణాజిల్లా రచయితల సంఘం , ప్రపంచ పుస్తక దినోత్సవ పండుగ రోజు సాయంత్రం - అంటే 23-4-2015 న శ్రీ గాజుల సత్యనారాయణ గారిని అభినందించి సత్కరించింది . పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయనని సత్కరించారు. ఈ అభినందన సభ, కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, శ్రీ గుత్తికొండ సుబ్బారావు, కార్యదర్శి డా . జి .వి . పూర్ణచంద్ ఆధ్వర్యంలో సంబరంగా జరిగింది .
డా . డి . రవి (తంజావూరు సరస్వతి మహల్ గ్రంధాలయం , తెలుగు పండితులు) సరస్వతి గ్రంధాలయం యొక్క విశేషాలను చెప్పారు. ఇది అతి పురాతనమయిన గ్రంధాలయం అన్నారు . వారు చెప్పిన విశేషాలు విని
వెంటనే తంజావూరు వెళ్లి ఆ తెలుగు గ్రంధాలయా న్ని సందర్శించి తరించాలనిపించింది చాలా మందికి .
శ్రీ గుత్తికొండ సుబ్బారావు , డా . జి .వి . పూర్ణచంద్ , డా . ఈమని శివనాగి రెడ్డి ( రాష్ట్ర సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు ), డా . పాలెపు సుబ్బారావు (ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంధాలయ మరియు పరిశోధనాలయ సహాయ సంచాలకులు , హైదరాబాద్ ), డా . రావి శారద (కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం), శ్రీ శిరం రామారావు (విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు) ప్రసంగించారు .
సభ ముగింపులో "పుస్తకం " మీద కొందరు తమ కవితలను చదివి వినిపించారు .
Friday, February 20, 2015
Saturday, September 20, 2014
Thursday, August 14, 2014
Thursday, February 21, 2013
Wednesday, August 29, 2012
Saturday, December 3, 2011
Thursday, October 27, 2011
Thursday, July 21, 2011
తెలుగులో కొత్త మాటలు అనువాదాలేనా?!! అనువాద వాదాలు
నండూరి రామమోహన్ రావు గారి అనువాద శైలి చాలా బాగుంటుంది అనేవారు ఆంధ్ర పత్రిక శివలెంక రాధాకృష్ణ గారు. మొదటిసారిగా ఒక ఆంగ్ల వ్యాసం నాకు ఇచ్చి అనువాదం చేయమన్నారు. అనువాదం చేయాల్సిన దానిని పూర్తిగా చదివి , దానిని తెలుగులో మరెవరికయినా చెపుతున్నట్టుగా వ్రాయమన్నారు . ప్రతి వాక్యం అనువాదం చెయ్యనక్కరలేదు , విషయాలు వదలిపెట్టకుండా చూసుకుంటే చాలు అన్నారు. ఇదే పద్దతిలో చాలా అనువాదాలు అయన నాకు అప్పగించగా చేశాను. అలాగే ఓ ఇంగ్లిష్ నవలని అనువాదం చేసి ఇచ్చాను. 48 వారాలపాటు ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో ప్రచురించారు.
కప్పగంతు శివరాం ప్రసాద్ గారు (సాహిత్య-అభిమాని బ్లాగ్)ఈ మధ్య ఆంగ్ల పదాలకు అనువాదపు వాదాల గురించి చెప్పారు. తెలుగు పదాల సరళత గురించి ప్రకటన ముద్ర నా బ్లాగ్లో కూడా వేస్తామన్నారు. అయన అభిప్రాయాలతో ఏకీభవిస్తూ. సరే అన్నాను.
ఆల్ ఇండియా రేడియో ఆంటే ఆకాశవాణి గా అన్ని భారతీయ భాషలలోను చెలామణి అవుతోంది (తమిళ నాడులో మాత్రం - "వాణీ నిలయం"-ట --ఈ వివరాలు శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు, డైరెక్టర్ , ఆకాశ వాణి, విజయవాడ కేంద్రం --- , అడగ్గా చెప్పారు).
టెలివిషన్ ఆంటే దూరదర్శన్ గా పేరు తెచ్చుకుంది. నిజానికి ఇవి రెండూ అనువాదాలు కావు. ఇంగ్లిష్ వస్తువులకు సరళమయిన తెలుగు పదాలు. ఎయిర్ ప్లేయిన్ ని విమానం అని చక్కగా వాడుకుంటున్నాము కదా! (ఆంగ్లంలో ఎయిర్ ని అనుసరించి గాలి అనే మాట తెలుగులో వాడలేదే) "రైల్ " ని ధూమ శకటం అని గ్రాంధికంలో కాకుండా పొగ బండి అనొచ్చు ., ఎడ్లబండి లా. ఇప్పుడు పొగ పోయింది కాబట్టి పట్టాల బండి అనవచ్చు.
ఈరోజు దిన పత్రికలో చదివాను. స్కూల్ యూనిఫారం బదులుగా ఏకరూప దుస్తులు అని వ్రాశారు. ఇది అనువాదపు మాటేకాని, సరైన తెలుగు పదమా!! పాఠశాల దుస్తులు అని రాయవచ్చు. మరింత సరళంగా బడి బట్టలు అనవచ్చు కదా. ఏం, మడి బట్టలు, తడి బట్టలు, ఇస్త్రి బట్టలు , బట్టలు ఆరేయటం, బట్టలు సర్దటం ...ఇలా మనం అనటం లేదా?
ఇప్పుడు మనం చేయాల్సింది ఇంగ్లిష్ వస్తువులను మక్కికి మక్కి అనువాదం చేయకుండా , ఆ వస్తువు గుణాన్ని అర్ధం చేసుకుని సరళమయిన తెలుగు పదం గా చేయడం. అది కుదరనప్పుడు, కుదిరేదాకా ఇంగ్లీష్ పదాన్ని అలాగే వాడేయటం చేయాలి. కంప్యూటర్ ని గణనిధి , ఇంటర్ నెట్ ని లోక దర్శిని , ఇ-మెయిల్ ని ఉత్తరంగాలు అనకూడదా, ఆలోచించండి!
***
Subscribe to:
Posts (Atom)









